వేరుశనగ కాయలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Jun 17 , 2025 | 11:01 PM
ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వేరుశనగ కాయలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏవో రాజకుమారి, టీడీపీ యు వజన మండల నా యకుడు యనమల మదనమోహన పేర్కొన్నారు.

లక్కిరెడ్డిపల్లె, జూన17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వేరుశనగ కాయలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏవో రాజకుమారి, టీడీపీ యు వజన మండల నా యకుడు యనమల మదనమోహన పేర్కొన్నారు. మంగళవారం దిన్నెపాడు, కస్తూరిరాజుగారిపల్లె గ్రామాల్లో సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ కోసం రైతుకు 50 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తన కాయలను ప్రభుత్వం సరఫరా చేస్తోందని, దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సహకారంతో లక్కిరెడ్డిపల్లె మండలానికి 20 క్వింటాళ్ల వేరుశనగ కాయలు మంజూరు చేయించారన్నారు. కం దులు, ఉలవలు, అలసందలు, ఆముదాలు సకాలంలో అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ ఏడీహెచ బెనర్జీ, పశువైద్యాధికారి మహేశ, డాక్టర్ ఎస్‌యండీ షఫీనాయక్, జయరాములు, ధర్మరా జు, పీరయ్య, ఓబులేసు, రాజు, నాగేంద్రరాజు, జనార్థనరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.