Share News

పారిశుధ్య పనులపై శ్రద్ద వహించండి : డీపీఓ

ABN , Publish Date - Aug 19 , 2025 | 10:52 PM

వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనుల నిర్వహణపై శ్రద్ద వహించాలని డీపీఓ రాధమ్మ ఆదేశించారు.

పారిశుధ్య పనులపై శ్రద్ద వహించండి : డీపీఓ
కార్యదర్శులకు సూచనలిస్తున్న డీపీఓ రాధమ్మ

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనుల నిర్వహణపై శ్రద్ద వహించాలని డీపీఓ రాధమ్మ ఆదేశించారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశమైన ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో చెత్తసేకరణ ఏరోజుకారోజు పూర్తి చేయాలని, సేకరిం చేటప్పుడు తడి, పొడి చెత్తను వేరుచేసి కంపోస్టుయార్డుకు తరలించాలన్నారు. ఎక్కు వ వర్షం కురిసినప్పుడు మురుగుకాల్వల్లో చెత్త, పూడికమన్ను చేరకుండా మురుగు నీటి కాల్వలను శుభ్రం చేయించాలన్నారు. తాగునీటి ట్యాంకులను నిర్దేశించిన సమ యానికి క్లీన్‌ చేయించి, బ్లీచింగ్‌ చేయించాలన్నారు. వీధిలైట్ల నిర్వహణ, పంచాయతీకి రావాల్సిన పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ మస్తాన్‌వలి, ఈఓఆర్డీ అబ్దుల్‌ షుకూర్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 10:52 PM