Share News

వాహనాల పార్కింగ్‌ లేక ఇక్కట్లు

ABN , Publish Date - May 17 , 2025 | 11:53 PM

పట్టణ జనాభాతోపాటు వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ పార్కింగ్‌ స్థలాల్లే ప్రధాన రహదారిపైనే ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపుతున్నారు.

వాహనాల పార్కింగ్‌ లేక ఇక్కట్లు
పోరుమామిళ్లలో రహదారుల పక్కనే నిలిపిన ద్విచక్ర వాహనాలు

ప్రధాన రహదారిపైనే వాహనాలు నిలిపిన వైనం ఇబ్బందులు పడుతున్న ప్రజలు కనపడని ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు

పోరుమామిళ్ల, మే 17 (ఆంధ్రజ్యోతి) :పట్టణ జనాభాతోపాటు వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ పార్కింగ్‌ స్థలాల్లే ప్రధాన రహదారిపైనే ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్‌ సమస్య పెరిగి అటు పట్టణవాసులు ఇటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పోరుమామిళ్లలో కాలానుగుణంగా షాపులు పెరగడం, గ్రామీణ ప్రాంతా ల్లోని వారు పోరుమామిళ్లకు రావడంతో వాహనాల సంఖ్య పెరిగి పార్కిం గ్‌ స్థలం లేకపోవడంతో రోడ్లుక్కనే వాహనాలు నిలిపి వ్యాపార లావా దేవీలు చూసుకుని తాపీగా పని పూర్తయ్యేక వెలుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోరుమామిళ్ల రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి రోడ్డు 80 అడుగుల వెడల్పుతో డ్రైనేజీ ఫ్లాట్‌ఫారం, రోడ్లు నిర్మించాలని టెండర్లు జరిగి పనులు జరిగినా అర్ధాంతరంగా అవి ఆగిపో వడంతో వాహనదారులకు ప్రజలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఉన్న రోడ్డు కుదించుకుపోవడం, టూవీలర్‌ కూడా పెట్టుకోవడానికి స్థలం లేకపో వడంతో షాపుల ముందు వాహనాలను నిలిపివేస్తున్నారు. అంతేకాక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలో రోడ్డు పక్కనే కార్లు, జీపులు పెట్టడంతో వాహనాల రాకపోకలకు ప్రజలు రోడ్డు దాటాలన్నా ఇబ్బందిక ర పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ గ్రామీణ బ్యాంకు సమీపంలో బ్యాంకుకు వచ్చే వారికి పార్కింగ్‌ స్థలంలేకపోవంతో రోడ్లు పైనే వాహనా లు నిలుపుతన్నారు. అలాగే స్టేట్‌బ్యాంకు వద్ద కూడా ఇదే పరిస్థితి ,నెలకొంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పోరుమామిళ్లలో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటుంది. మహాత్మాగాంఽధీ విగ్రహం సర్కిల్‌, ఆర్టీసీ బస్టాండు, వరికుంట్ల బస్టాండు ఏరియాలో ఎక్కువగా జన సమూహం ఉంటుండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నా యి. ట్రాఫిక్‌ నియంత్రణ కోసం పోలీసు అధికారులు అవగాహన సదస్సు లు నిర్వహించి హెచ్చరికలు జారీ చేసినా షరా మామూలే అన్నరీతిలో వాహనాలను రోడ్లపక్కనే నిలుపుతున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయ. గతంలో కొన్ని ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచే సుకున్న ఘటనలున్నాయి. మరి రోడ్లు విస్తరణ పనులు తిరిగి మరలా ఎప్పుడు ప్రారంభిస్తారో? పార్కింగ్‌ స్థలాలు ఎక్కడ కేటాయించి సమస్యలే కుండా చేస్తోరోనని పోరుమామిళ్ల ప్రజలు ఎదురు చూస్తున్న్నారు.

రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే సమస్య ఉండదు

రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాక పార్కింగ్‌ సమస్య తీరుతుంది. ప్రస్తుతం పట్టణంలో ఉదయం నుంచి రాత్రి వరకు పోలీసు సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ సమస్య లేకుండా చేస్తున్నాం. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగిస్తే జరిమానా విధిస్తాం. ప్రజలు కూడా సహకరించాలి.

-శ్రీనివాసులు, సీఐ, పోరుమామిళ్ల

Updated Date - May 17 , 2025 | 11:53 PM