శరవేగంగా ఓవర్ బ్రిడ్జి పనులు
ABN , Publish Date - May 12 , 2025 | 11:41 PM
ఎర్రగుంట్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి పొడిగింపు పనులు శరగవేగం గా జరుగుతున్నాయి.
మరో నెలలో అందుబాటులోకి
తీరనున్న ఎర్రగుంట్లవాసుల,
ప్రయాణికుల కష్టాలు
ఫలించిన ‘ఆంధ్రజ్యోతి’ కృషి
ఎర్రగుంట్ల, మే 12(ఆంధ్రజ్యోతి): ఎర్రగుంట్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి పొడిగింపు పనులు శరగవేగం గా జరుగుతున్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూ స్తున్న ఈ బ్రిడ్జి పనులు ఒక నెలలో పూర్తిచేసుకు ని అందుబాటులోకి రానున్నది. పెరుగుతున్న రైలు వేగానికి తగ్గట్టుగా ఎక్కడా ప్రమాదాలు జరగకూడ దన్న రైల్వే నిబందనలు అనుసరించి ఎర్రగుంట్లలో ట్రెస్‌పాస్ లేకుండా రైల్వేస్టేషన చుట్టూ ప్రహరీని నిర్మించారు. దీంతో రెండు ఫ్లాట్‌ఫాంలకు వెళ్లేందు కు ప్రొద్దుటూరు వైపు నుంచి రస్తా బంద్ అయ్యిం ది. అలాగే స్టేషన గ్రామాన్ని రెండుగా చీలుస్తూ నడిబొడ్డులో ఉండటంతో ఉత్తరం వైపు నుంచి దక్షి ణం వైపునకు వచ్చేందుకు రస్తా పూర్తిగా బంద్ అయ్యింది. దీంతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల కు, ఆసుపత్రికి, పోస్టాఫీసు, ప్రొద్దుటూరుకు, బాలి కల హైస్కూల్‌కు, వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అలాగే దక్షిణం వైపు ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు, జడ్పీహైస్కూల్స్, కాలేజిలు, ము ద్దనూరు వైపు వెళ్లేందుకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డా యి. రెండు ఫ్లాట్‌ఫాంల్లో ఎక్కడ దిగినా బయటికి రావాలంటే 1.8 కిలోమీటర్లు నడిచి రావాల్సి ఉండే ది. రాత్రి పూట మహిళా ప్రయాణికులకు మరీ ఇబ్బందికరంగా ఉంది. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి అం దుబాటులోకి వస్తే ఇబ్బందులు తొలుగుతాయి,
రూ.58లక్షలతో నిర్మాణం: ఫుట్ ఓవర్ బ్రిడ్జి పొడిగింపునకు రూ.58లక్షలతో టెండర్లు పిలిచా రు. కడప చెందిన కంపెనీ ఈ పనులు దక్కించు కుని నిర్మాణ పనులు మొదులుపెట్టింది. నిర్ణీత కాలపరిధిలోనే దీన్ని పూర్తిచేసేందుకు ప్రయత్ని స్తున్నారు. ఇప్పటికే ఐరనకాలమ్స్‌తో కూడిన పను లు పూర్తిచేసుకుని ఎరెక్షన కూడా సోమవారం పూర్తిచేశారు. కింద భాగంలో మరికొంత ఎరె క్షన పూర్తి కావాల్సి వుంది. వెంటనే సిమెంటు కాంక్రీట్ పనులు కూడా పూర్తిచేసుకుని ఒక నెలలో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ప్రమాదాలకు అడ్డుకట్ట: రెండు ఫ్లాట్‌ఫాంల నుంచి బయటికి రావాలంటే రెండు కిలోమీటర్లు లగేజిలతో, పిల్లలతో, వృద్ధులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీంతో ప్రహరీ ఎక్కి దిగేవారు. ఈ నేఫథ్యంలో పక్కనే ఉన్న లోతైన డ్రైనేజీలో పడి ఒక ప్రయాణికుడు మరణించగా, మరో ఇద్దరు తీవ్రగాయలు పాలుకాగా, ఎంతో మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. వాట న్నింటిని ఒకే సమాఽధానంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉత్తరం వైపు పొడ గించడమే. అది త్వరలో పూర్తి కావస్తుండటంతో రైల్వే ప్రయాణికుల, ఎర్రగుంట్ల ప్రజల కష్టాలు తీరనున్నాయి.
వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులే:: రైల్వే ప్రయాణికుల్లో వృద్ధులకు, దివ్యాంగులకు ఇప్పటి కి కష్టాలు తప్పవు. ఇక్కడ లిఫ్ట్ సిస్టం లేక పోవడం తో ముఖ్యంగా దివ్యాంగులు ఒకవట ఫ్లాట్‌ఫాం నుంచి రెండవ ఫ్లాట్‌ఫాంకు రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వృద్ధుల పరి స్థితి కూడా ఇంతే. కేవలం వీల్‌చైర్ మాత్రమే ఆదుకుంటోంది. రెండు ఫ్లాట్‌ఫాంను అనుసంధా నం చేసే పాతవేలో గూడ్స్ రైళ్లు అడ్డంగా ఆగడం తో వీల్ ఛైర్ కూడా ఉపయోగ పడటంలేదు. దీం తో వారు నరకం చూస్తున్నారు.
ఫలించిన ‘ఆంధ్రజ్యోతి’ కృషి: రైల్వే ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం ‘ఆంధ్రజ్యోతి’ అనేక కథనా ల ద్వారా అధికారులను కదిలించింది. జీఎం, డీఆర్ ఎంల దృష్టికి తీసుకెళ్లింది. అనేక సార్లు వందలాది మందితో సంతకాల సేకరణ కూడా చేసి అధికా రులను కదిలించింది. చివరగా డీఆర్‌ఎం మనీష్ అగర్వాల్ స్పందించి ప్రతి పాదనలు పంపి, టెండ ర్లు పిలవడంతో పనులు వేగవంతమయ్యాయి.