సా..గుతున్న విస్తరణ పనులు
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:56 PM
పోరుమామిళ్ల రోడ్డు విస్తరణ పనులు ముందుకు మూడు అడుగులు, వెనక్కి ఏడడుగులు అన్నట్లు తయా రైంది.
ముందుగా 80 అడుగుల వెడల్పుతో అంచనాలు
పనులు పూర్తి ఎన్నటికోనంటున్న ప్రజలు
ప్రజలు సహకరిస్తే వేగవంతం చేస్తామంటున్న అధికారులు
ఇదీ! పోరుమామిళ్ల రోడ్డు పనుల వెతలు
పోరుమామిళ్ల, సెప్టెంబరు1 (ఆంధ్రజ్యోతి) : పోరుమామిళ్ల రోడ్డు విస్తరణ పనులు ముందుకు మూడు అడుగులు, వెనక్కి ఏడడుగులు అన్నట్లు తయా రైంది. ముందుగా రోడ్లుకు ఇరువైపులా 80 అడుగుల వెడల్పుతో అప్పటి ఆర్డీవో వెంకటరమణ, జిల్లా ఆర్‌అండ్‌బీ అధికారులు నాలుగైదు సార్లు విజిట్ చేసి కొలతలు వేసి మార్కింగ్ కూడా ఇచ్చారు. కానీ పనులు చేయడంలో వారు తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతం అంచనాలు మారే విధంగా తయా రయ్యాయి. నర్సింగపల్లె నుంచి మల్లకతవ వరకు రోడ్డువెడల్పు చేయాల్సి ఉం ది. అంబేడ్కర్ సర్కిల్ నుంచి మల్లకతవ వరకు సిమెంటు రోడ్డు నిర్మాణం డ్రైనేజీ కాల్వలు, ప్లాట్‌ఫాం నిర్మించాల్సి ఉండగా బిల్లులు చెల్లించకపోవడంతో గత వైసీపీ పాలనలోనే పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిల్లులు వచ్చినా చాలాకాలం జాప్యం జర గడంతో ఎట్టకేలకు నాయకులు, అధికారులు కాంట్రాక్టర్లను ఒప్పించి పనుల కు శ్రీకారం చుట్టారు. ఈ పనులు కూడా ఒక చోట క్రమం లేకుండా వారికి తోచినవిధంగా నిర్మాణాలు చేపట్టాల్సి వచ్చింది. పోలీసుస్టేషన ఒక వైపు సిమెంటు రోడ్ల నిర్మాణం చేపట్టారు. ముందుగా డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం, అవి కూడా కొలతలు కుదించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. రోడ్డుకు ఇరువైపులా 80 అడుగులు విస్తీర్ణం వేయాల్సి ఉండగా గతంలో వేసిన మార్కింగ్ కంటే ఒక చోట మూడు అడుగులు మరో చోట ఐదు అడుగులు ఇష్టమొచ్చినట్లు అంచనాలు మార్చుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. చాలామంది రోడ్లపైనే లెట్రిన్లకు గుంతలు తవ్వడం, రోడ్ల పక్కనే బోర్లు వేసినట్లు డ్రైనేజీ కాలవల కోసం అంబేడ్కర్ సర్కిల్ నుంచి మట్టిని తొల గించే క్రమంలో వెలుగు చూశాయి. దీంతో ఆ నివాసగృహల యజమానులు అభ్యంతరాలు చెప్పడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు, రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. చివరికి రెవెన్యూ స్థలం ఎంత వరకు ఉంటే అంత వరకే పనులు చేసి వచ్చినకాడికి బిల్లులు తీసుకుని పనులు క్లోజ్ చేద్దామనే పరి స్థితిలో కాంట్రాక్టరు ఉండిపోయారు టెండర్లు జరిగిన తరువాత కొలతలు తీసుకున్నాక ప్రైవేటు స్థలానికి దాదాపు ఎకరా 28 సెంట్ల వరకు నష్టపరి హారం చెల్లించాల్సి వస్తుందని భావించి ప్రభుత్వం ఉన్న స్థలంలోనే నిర్మా ణం చేపడుతున్నారు. ఎవరైనా ఇంటి నిర్మాణాలు, వ్యాపార సముదాయాలు సంబంధించి నిర్మాణాలు చేపట్టేవారు పంచాయతీకి డ్రైనేజీ కాల్వలకు స్థలం వదలాల్సిఉంది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదనే చెప్పాలి. అంతేకాక విద్యుత బోర్లు, ట్రాన్సఫార్మర్లు తొలగించకుండానే పనులు చేపట్టారు. నర్సిం గపల్లె నుంచి మల్లకతవ వరకు 30 ట్రాన్సఫార్మర్లు, 120కి పైగా విద్యుత స్తంభాలు రోడ్డుకిరువైపులా ఉన్నాయి. వాటికి సంబంధించి రూ.కోటి 20 లక్షలు ఆర్‌అండ్‌బీ అధికారులు చెల్లించాలన్న అంచనాలు వేపి ప్రభుత్వానికి పంపినా నిధులు మంజూరు కాలేదు. అలాగే మరో రూ.22 లక్షలు చెల్లిం చాల్సిన వాటి అంచనాలు కూడా వేసి ప్రభుత్వానికి పంపారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు. అధికారులు స్పందించి రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేసి ప్రణాళిక ప్రకారం నిర్మిస్తే ప్రజల కష్టాలు తీరుతాయి.
ఆర్ అండ్‌బీ అధికారులు ఏమన్నారంటే: ఈ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి ఆర్‌అండ్‌బీ ఈఈ నరసింహారెడ్డి, డీఈ సలీంలను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, గత ప్రభుత్వంలో 80 అడుగులకు అంచనాలు వే శారన్నారు. కానీ ప్రస్తుతం ఆ మేరకు రోడ్డుకు ఇరువైపులా పూర్తిస్థాయిలో పనులు చేప ట్టాలంటే ప్రైవేటు ఆస్తులు ఉన్నవారికి నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఇందుకు ప్రజలు సహకరిస్తే ముందు నిర్ణయించినట్లుగానే పనులు చేపడతామన్నారు. అలా కాకుంటే ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ఇచ్చిన కొలతల మేరకు నిర్మాణాలు చేపడుతున్నామన్నారు.