పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ABN , Publish Date - May 26 , 2025 | 12:05 AM
మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో 1989-90 పదోతరగతి చదివిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.
ముద్దనూరు మే25(ఆంధ్రజ్యోతి):మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో 1989-90 పదోతరగతి చదివిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు ప్రసాద్, రమాదేవి,భారతీ లను ఘనంగా సన్మానించారు. 35 సంవత్సరాల ముందు వారి పాఠశాల జ్ఞాపకాలను విద్యార్థులతో ఉపాధ్యాయులు పంచుకున్నారు. కడప దుర్గమ్మ ఆలయం ధర్మకర్త దుర్గాప్రసాద్ సతీమణి వరదలక్ష్మి, డీఎస్పీ గంగయ్య సతీమణి రాజమ్మ మరికొందరు మాట్లాడుతూ ఇన్నేళ్ల తరువాత చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఉన్నతపాఠశాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు రూ.50,116 నగదు ప్రధానోపాద్యాయుడు రాజాబాబుకు అందజేశారు.ఈ కార్యక్రమంలో రమేష్, తిరుపతయ్య, ఖదీర్,మురళీ, పూర్వపు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగుంట్లలో అపూర్వ కలయిక
ఎర్రగుంట్ల, మే 25(ఆంధ్రజ్యోతి): ఎర్రగుంట్ల బాలుర ఉన్నత పాఠశాల 1992-93 టెన్త బ్యాచ విద్యార్థుల అపూర్వ కలయిక ఆదివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల హెచఎం రామాంజనేయరెడ్డి అధ్యక్షతన నిర్వహిం చిన ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాఠశాలలో తాము చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. 32 సంవత్సరాల తరువాత కూడా తమను గుర్తుపెట్టుకుని ఆహ్వానించి గౌరవించడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ గురువులను ఘనంగా సన్మానించారు.