2003 ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేయాలి
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:56 PM
ఉద్యోగాలు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి కోరారు.
ప్రొద్దుటూరు టౌన్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాలు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి కోరారు. గురువారం కామనూరులో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని కలిసి 2003 ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఒంటేరు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ విధానం 2004 నుంచి అమలు అయిందని, 2003 నోటిఫికేషన్‌లో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు 2005లో ఉద్యోగాల్లో చేరారని దీంతో వారిని ప్రభుత్వం సీపీఎస్ విధానంలోకి చేర్చిందన్నారు. సీపీఎస్ కన్నా ముందు వారు ఉద్యోగాలకు ఎంపికైనందున పాతవారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి న్యాయమైన డిమాండ్ అని, పాత పెన్షన్ అమలు కావడానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు రవీంద్రారెడ్డి, రామిరెడ్డి, ఆలీ, ఉమామహేశ్వరరెడ్డి, చంద్రకళ, సునీత, మధు, సుధాకర్ పాల్గొన్నారు.