జాబ్‌కార్డులు అందజేసిన అధికారులు
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:28 PM
జమ్మలమడుగు ఎస్.ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీవాసులు మంగళవారం జాబ్‌కార్డులు అందుకున్నట్లు తెలిపారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
జమ్మలమడుగు, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగు ఎస్.ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీవాసులు మంగళవారం జాబ్‌కార్డులు అందుకున్నట్లు తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికల్లో ‘జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ జాబ్‌కార్డుల్లో నిర్లక్ష్యం’ అన్న కథనం ప్రచురితమైంది. వెంటనే జిల్లా అధికారులు స్థానిక సిబ్బందికి గట్టి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. వెంటనే ఎస్సీ కాలనీలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు జాబ్‌కార్డుల విషయంలో సమస్య ఉందని, చెప్పినవారిని పిలిపించి వారికి ఆగమేఘాలపై జాబ్‌కార్డులు అందించారు. బుధవారం నుంచి ఎస్.ఉప్పలపాడు గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్లవచ్చని బాధితులందరికి జాబ్‌కార్డులు అందించినట్లు కడప డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అందులో ఎస్.ఉప్పలపాడు గ్రామంలో కలెక్టర్‌కు చెప్పినవారే కాకుండా మొత్తం అయిదుగురికి జాబ్‌కార్డులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. లంక మేరీ, బత్తల సాలమ్మ, బత్తల మేరమ్మ, కొమ్మగాండ ్ల జయమ్మ లంకా మేరీ, అనే అయిదుగురికి జాబ్‌కార్డులు ఇచ్చినట్లు వారికి వెంటనే పని కల్పిస్తామని బుధవారం ఉదయం నుంచి వారు పనిలో వెళ్లవచ్చని స్థానిక అధికారులకు ఆదేశించినట్లు జిల్లా అధికారి తెలిపారు.