తెలుగువారి ఆరాధ్యుడు ఎన్టీఆర్
ABN , Publish Date - May 29 , 2025 | 12:13 AM
తెలు గువారి ఆరాధ్యుడు, టీడీపీ వ్యవస్థాపకుడు, మా జీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావని వక్తలు పేర్కొన్నారు.
ఘనంగా జయంతి వేడుకలు నివాళులర్పించిన టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు
ప్రొద్దుటూరు టౌన్, మే 28 (ఆంధ్రజ్యోతి):తెలు గువారి ఆరాధ్యుడు, టీడీపీ వ్యవస్థాపకుడు, మా జీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావని వక్తలు పేర్కొన్నారు. ఎన్టీఆర్ 102వ జయం తిని పురష్కరించుకుని నందమూరి యువసేవా సమితి సభ్యులు . బుధవారం పొట్టిపాడు రోడ్డులో ఉన ్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కడపలో జరుగుతున్న మహానాడుకు వారు తరలి వెళ్లారు. నందమూరి యువసేవా సమితి అధ్యక్షుడు గోమేదికం సుదర్శన్, ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, టీడీపీ లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురప్పయాదవ్, జిల్లా తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్శి రామూనాయుడు, కృష్ణచైతన్యరెడ్డి, సుధాకర్‌యాదవ్ పాల్గొన్నారు.
జమ్మలమడుగులో: జమ్మలమడుగు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటరామిరెడ్డి, వారి సిబ్బంది ఎన్టీరామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రానికి స్వర్గీయ ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజలకు మంచి పరిపాలన అందించారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
బద్వేలు/టౌనలో: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎనటీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా నెల్లూరురోడ్డులోని ఆయన కాంశ్య విగ్రహానికి నాయీబ్రాహ్మణ కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్ కొలవలివేణుగోపాల్, మైనారిటీ ఫైనాన్స కార్పొ రేషన మాజీ డైరెక్టర్ షేక్ మహబూబ్‌బాషా, టీడీపీ సీనియర్ నాయ కుడు నాగభూషణం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించా రు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాషా, గంటా వెంకటయ్యయాదవ్, మస్తాన, రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు.
ఎర్రగుంట్లలో: తెలుగు ఆరాధ్య నాటుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్య మంత్రి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు ఎర్ర గుంట్ల మండలంలో ఘనంగా నిర్వహించారు. పోట్లదుర్తిలోని ఎనటీఆర్ కాలనీలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలు వేసి నివాళుల ర్పించారు. అభిమానులకు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీచేశారు. కార్యక్రమంలో సీఎం సురేష్‌నా యుడు, ఎంపీటీసీ పి.శివప్రతాప్‌రెడ్డి, సర్పంచి జి.నరసింహులు, ఉప సర్పంచి రామునాయుడు, వెంకటరమణనాయుడు, రామక్రిష్ణనాయుడు పాల్గొన్నారు. కాగా ఎర్రగుంట్లలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎనటీఆర్ అభిమా నులు ఆసుపత్రికి వచ్చిన వారికి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంజీవరెడ్డి, రమేష్‌నా యుడు, నాగభూషణ్‌రెడ్డి పాల్గొన్నారు.
ముద్దనూరులో:స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఎంపీడీవో ముకుందారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. పంచాయతీ ఈవో నరసింహులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పోరుమామిళ్లలో: స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశా లలో మాజీ ముఖ్యమంరత్రి స్వర్గీయ నందమూరి తారకరామరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం కళాశాల వైస్ ప్రిన్సి పాల్ ప్రకాశరావు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు సిబ్బంది పాల్గొని ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.