Share News

కార్మికుల సమ్మెపై నోటీసు అందజేత

ABN , Publish Date - Jun 30 , 2025 | 11:52 PM

కార్మికుల సమస్యలపై ఈనెల 9న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌ పిలుపునిచ్చారు.

కార్మికుల సమ్మెపై నోటీసు అందజేత
తహసీల్దారు పీర్‌మున్నీకి సమ్మె నోటీసు అందజేస్తున్న సీఐటీయూ నేతలు, కార్మికులు

రాజంపేట, జూన 30 (ఆంధ్రజ్యోతి): కార్మికుల సమస్యలపై ఈనెల 9న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌ పిలుపునిచ్చారు. సో మవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు రాజంపేట మున్సిపల్‌ క మిషనర్‌ శ్రీనివాసులు, తహసీల్దారు పీరుమున్నీలకు ముందస్తు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, ప్రైవేటీకరణను రద్దు చేయాలని, లేబర్‌కోడ్‌ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన నాయకులు రమణ, లక్ష్మీదేవి, ప్రసాద్‌, తహసీల్దారు ఆఫీసు వద్ద వీఆర్‌ఏ సంఘం నాయకులు శంకర్‌, సుబ్రమణ్యం, రమణయ్య, బాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 11:52 PM