Share News

ట్రాన్సఫార్మర్‌ పక్కనే కంటైనర్‌ దుకాణం

ABN , Publish Date - Oct 03 , 2025 | 11:52 PM

విద్యుత ట్రాన్సఫార్మర్‌ పక్కనే కంటైనర్‌ దుకా ణం ఏర్పాటు చేసినా అధికా రులు ఎందుకు పట్టించుకోరని పలువు రు ప్రశ్నిస్తున్నారు.

 ట్రాన్సఫార్మర్‌ పక్కనే   కంటైనర్‌ దుకాణం
కంటైనర్‌ దుకాణం పక్కనే ఉన్న ట్రాన్సఫార్మర్‌

పొంచి ఉన్న ప్రమాదం పట్టించుకోని అధికారులు

ప్రొద్దుటూరు , అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : విద్యుత ట్రాన్సఫార్మర్‌ పక్కనే కంటైనర్‌ దుకా ణం ఏర్పాటు చేసినా అధికా రులు ఎందుకు పట్టించుకోరని పలువు రు ప్రశ్నిస్తున్నారు. ప్రొ ద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో సెట్‌ బ్యాక్స్‌ స్థలాలను పార్కింగ్‌కు వదలకుండా ఆక్రమించి కంటైనర్‌ దుకాణాలు పెట్టించి భవంతుల యజమానులు అద్దెలు వసూలు చేస్తున్నా రు. ఈ ఆక్రమణలు గాంధీ రోడ్డుమీద గాంధీ విగ్రహం సమీ పంలో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురుచేస్తోంది. ఆ భారీ భవంతిలో జాతీయ బ్యాంకు, ప్రైవేటు హాస్పిటల్‌తో పాటు అనేక ఇనిస్టిట్యూట్స్‌ ఉండడంతో నిత్యం ప్రజలు భారీగా వచ్చి పోతుంటారు. ఆ కాంప్లెక్స్‌కు ముందు టూవీలర్‌ పార్కింగ్‌ లేక రోడ్డుపై పార్కింగ్‌ చేస్తున్నా టౌనప్లానింగ్‌ అదికారులకు పట్టలే దు. ఆ కంటైనర్‌ పక్కనే విద్యుత ట్రాన్సఫార్మర్‌ ఉన్నా విద్యుత అధి కారులు పట్టించుకోలేదు. కాగా ఈ విషయమై టౌనప్లానిం గ్‌ అధికారి చంద్ర మోహనను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఆ కంటైనర్‌ దుకాణం పెట్టుకోవడానికి తాము అనుమతి ఇవ్వలేదని వారికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే విద్యుత ఏఈ సుహాసిని వివరణ కోరగా కంటైనర్‌ దుకాణం ట్రాన్సఫార్మర్‌ పక్కనే పెట్టడం ప్రమాదకమన్నారు. దీనిపై కంటై న ర్‌ దుకాణం తొలగించమని నోటీసులు ఇచ్చామని చెప్పారు.

Updated Date - Oct 03 , 2025 | 11:53 PM