కార్మిక చట్టాలను మార్చడంపై దేశవ్యాప్త సమ్మె
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:55 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 29 కార్మిక చట్టాలను కేవలం 4 లేబర్‌కోడ్‌లాగా మార్చి అన్యాయం చేస్తోందని, దీనిపై జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సీఐటీయూ పిలుపునిచ్చిందని జిల్లా అధ్యక్షుడు సీహెచ చం ద్రశేఖర్ తెలిపారు.

పుల్లంపేట, జూన 10 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 29 కార్మిక చట్టాలను కేవలం 4 లేబర్‌కోడ్‌లాగా మార్చి అన్యాయం చేస్తోందని, దీనిపై జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సీఐటీయూ పిలుపునిచ్చిందని జిల్లా అధ్యక్షుడు సీహెచ చం ద్రశేఖర్ తెలిపారు. మంగళవారం పుల్లంపేటలో సీఐటీయూ మండల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీస వేతనాల చట్టం, పీఎఫ్, ఈఎ్‌సఐ, గ్రాట్యూటీ ఇలాంటి హక్కులు కార్మికులు కోల్పోతారన్నారు. మోటార్ ట్రాన్సపోర్ట్ ఆక్ట్ ప్రకారం డ్రైవర్లు యాక్సిడెంట్ చేస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షలు నష్టపరిహారం చెల్లించే విధంగా మార్చారన్నారు. సీఐటీయూ మండల అధ్యక్షురాలు శ్రీలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మండల సమన్వయ కమిటీని జిల్లా నాయకులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కన్వీనర్‌గా పి.రోజా, కోకన్వీనర్లుగా శ్రీనివాసులు, రోజా, కమిటీ సభ్యులుగా వెంకటరమణ, సునీత, స్వర్ణలక్ష్మీ ఎన్నుకున్నారు.