వైభవంగా నరసింహస్వామి జయంత్యుత్సవాలు
ABN , Publish Date - May 11 , 2025 | 11:36 PM
లక్ష్మీనరసిం హస్వామి వారి జయంత్యుత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.
కొండాపురం, మే 11 (ఆంధ్రజ్యోతి) లక్ష్మీనరసిం హస్వామి వారి జయంత్యుత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఇప్ప టికే పలుచోట్ల మూడు రోజుల నుంచే ఆయా ఆలయాల నిర్వాహకులు స్వామివారి బ్రహ్మోత్స వాలను నిర్వహిస్తున్నారు. కొండాపురం మండ లంలోని పొట్టిపాడు గ్రామంలో వెలసిన లక్ష్మీన రసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వామి జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహస్వామికి ప్రత్యేక పూ జలు, అభిషేకాలు నిర్వహించారు. కాగా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, టీడీపీ ఇనచార్జి భూపేష్‌రెడ్డి స్వామివారిని దర్శించుకు ని పూజలు చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ దేవగుడినారాయణరెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మండల టీడీపీ అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి, కూటమి నాయకులు చింతారామచంద్రారెడ్డి , శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మైదుకూరు రూరల్‌లో: మండలంలోని ఉప్పు గుంటపల్లెలో ప్రాచీనకాలంలో వెలసిన లక్ష్మీనర సింహస్వామి ఆలయంలో స్వామి వారి జయం త్యుత్సవాలు ఆదివారం వేడుకగా నిర్వహించా రు. .ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొని ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. క్రిష్ణ కిషోర్‌యా దవ్ ఆధ్వర్యంలో అన్నదానం, కోళాటం, చెక్కభజన కార్యక్రమాలు జరిగాయి.
గోపవరంలో: గోపవరం మండలంలోని వల్లెర వారిపల్లె గ్రామంలో వెలసిన స్వయంభు లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆది వారం నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభ వంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలు పూలమాలలతో స్వామివారిని అలంకరిం చారు. అలంకరణలో ఉన్న స్వామిని భక్తులు కన్నులపండువగా దర్శించుకున్నారు. ఉదయం 7.30 నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమ య్యాయి. 13 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతా యని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
నల్లగొండ నరసింహస్వామి తిరునాళ్లు
బి.కోడూరు, మే 11 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని ఎర్రి ఓబన్నబావి సమీపాన కొండ దడిన వెలసియున్న పురాతన నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి తిరునాళ్లు వైభవంగా నిర్వహించారు. స్వామివా రికి పూజాది కార్యక్రమాలు నిర్వహించగా భక్తు లు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించు కుని పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించా రు. అక్కడికి వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే మండల పరిధిలోని విజయనగర కాలనీ (సిరిగిరిపల్లె) గ్రామంలో నరసింహస్వామి జయంతి సందర్భం గా లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు రాజా యోగి ఓబయ్య, గుర్రమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. పూజా కార్యక్రమా ల్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
కమనీయం సీతారాముల కల్యాణం
బద్వేలుటౌన, మే 11 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ని మైదుకూరురోడ్ కుమ్మరికొట్టాలలో వెలసి ఉన్న సీతారామస్వామి ఆలయంలో ఆలయ వార్షికోత్సవం సందర్బంగా సీతారాముల కల్యా ణాన్ని అత్యంత వైభవంగా కమనీయంగా నిర్వహించారు. అనంతరం ఆలయకమిటీ వారు భక్తాదులకు తీర్థప్రసాదాలు, అన్నదాన వితరణ చేపట్టారు. సాయంత్రం సీతారాముల గ్రామోత్స వంలో కోలాటం ఎంతగానో ఆకట్టుకుంది.
కాశినాయనలో: మండలంలోని పిట్టిగుంట గ్రా మంలో ఆదివారం సీతారాముల కల్యాణం కన్ను ల పండువగా సాగింది. రాములవారి గ్రామోత్స వంలో ప్రదర్శించిన కేరళా డ్రమ్స్ పలువురురిని ఆకట్టుకున్నాయి. అనంతరం పెద్దఎత్తున్న అన్న దానం ఏర్పాటుచేశారు.