సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:45 PM
సైబర్ నేరాలపై ఎస్ ఐ రామకృష్ణ మంగళవారం కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
గాలివీడు, జూలై29(ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాలపై ఎస్ ఐ రామకృష్ణ మంగళవారం కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుడ్ టచ, బ్యాడ్ టచ, స్వయ రక్షణ, బాల్య వివాహాలు, తెలియని వయస్సులో ప్రేమ, ఆకర్షణ, సోషల్ మీడియాలో పరిచయాలు, అనలైన వేధింపులు, ప్రేమ పేరుతో వలవేసి చేసే ఆర్థిక, శారీరక, మానసికంగా ఇబ్బందులు, మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్‌పై అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు భారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.