Share News

మురుగులో మున్నెల్లిరాజుపాలెం

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:07 AM

మురుగు లో మున్నెల్లి గ్రామం కొట్టు మిట్టాడుతోంది ఆ గ్రా మంలో ఒకప్పుడు జిల్లారాజకీయాలు శాసించిన వారు ఉన్నారు.

మురుగులో మున్నెల్లిరాజుపాలెం
మున్నెల్లిరాజుపాలెంలో రోడ్డుపై నిలిచిన మురుగునీరు, పక్కన చెత్తకుప్పలు

రాజకీయ ఉద్దండులు కలిగిన ఆ గ్రామంలో అధ్వానంగా రోడ్లు పారిశుధ్య లోపం, గుంతల రోడ్లు దర్శనమిస్తున్న వైనం

బి.కోడూరు. ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : మురుగు లో మున్నెల్లి గ్రామం కొట్టు మిట్టాడుతోంది ఆ గ్రా మంలో ఒకప్పుడు జిల్లారాజకీయాలు శాసించిన వారు ఉన్నారు. ఒకప్పుడు అప్పటి ఎమ్మెల్యే చిదా నందం, తర్వాత శివరామక్రిష్ణారా వుకు ముఖ్య అనుచరులు. బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయ మ్మ, టీడీపీ ఇనచార్జి రితీష్‌రెడ్డి. ముఖ్య అనుచ రులతోపాటు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధాకు అనుచరులు ఈ గ్రామంలోనే ఉన్నారు. అంతే కాకుండా ప్రస్తుత రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు కూడా ఈ గ్రామానికి చెందినవారే. అదే బికోడూరు మండలం మున్నెల్లి రాజుపాలెం గ్రామం. ఈ గ్రామంలో దాదాపు 400 కుటుంబా లు,1100 మంది జనాభా ఉన్నారు. కొంతమంది మాత్రమే వ్యవసాయం, పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తుంటారు. ఆ గ్రామంలో 2వేలకు పైగా పశువులుఉంటాయి. గ్రామంలో ఒకే ఒక్క వీధి రోడ్డు ఉండగా మిగతా వీధులన్నీ సందులు గొందుల రోడ్లే. ఆ గ్రామంలో జనాభా, పశువులు ఎక్కువగా ఉండడంతో వీధుల గుండా మురు గుపారుతుంటుంది. వర్షాకాలం వచ్చిందంటే మం డలంలో అన్ని గ్రామాలు ఒక ఎత్తయితే ఆ గ్రా మంలో ఎక్కువగా రోగాలు విష జ్వరాలు వస్తుం టాయి. దోమలు అధికంగా ఉంటాయి సిమెంటు రోడ్లు ఏర్పాటు చేసి డ్రైనేజీ నిర్మిస్తే సమస్య పరి ష్కారమవుతుందని గ్రామస్థులంటున్నారు. అధికా రులు స్పందించి సిమెంటు రోడ్డు, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఎంపీడీవో ఏమన్నారంటే: ఈ విషయమై ఎంపీడీవో భాస్కర్‌రావును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా గ్రామంలో రోడ్లపై మురుగగునీరు నిల్వ, ఉన్న మాట వాస్తవమేనన్నారు. అయితే రోడ్లు డ్రైనేజీ ఏర్పాటు చేసేందుకు పంచా యతీరాజ్‌ ఏఈని ఉన్నతాధికారులకు నివేదిక పంపమని చెప్పామన్నారు. కాగా పంచాయతీరాజ్‌ ఏఈ నారాయణరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో గతం లో సిమెంటు రోడ్డు వేశారని, అది పూర్తిగా దెబ్బ తిని గుంతలు ఏర్పడ డంతో ఇబ్బందులు కలుగు తున్నాయన్నారు. ఈవిషయమై జిల్లా అధికారు లకు నివే దిక కూడా పంపించామని నిధులు మంజూరు చేసిన వెంటనే ఆ గ్రామంలో సిమెం టు రోడ్డు, డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

నిధులు రాకనే సమస్యలు: గ్రామ పంచాయతీ కి ఎలాంటి నిధులు రాలే దని సొంత గ్రామంలో కూడా తాను ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిం దని, స్థానిక సర్పంచ గురయ్యపేర్కొన్నారు. నిధు లు వచ్చిన వెంటనే గ్రామంలో సమస్య లు పరి ష్కరిస్తానని ఆయన తెలిపారు.

Updated Date - Aug 19 , 2025 | 12:07 AM