మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె విరమణ
ABN , Publish Date - Jul 23 , 2025 | 12:16 AM
విధులు బహిష్కరించి గత 10 రోజులుగా సమ్మెబాట పట్టిన మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుధ్యకార్మికులు మంగళవారం సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించా రు.
విధుల్లో చేరుతున్నట్లు ఈఈకి నోటీసు అందజేత
ప్రొద్దుటూరు ,జూలై22 (ఆంధ్ర జ్యోతి) : విధులు బహిష్కరించి గత 10 రోజులుగా సమ్మెబాట పట్టిన మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుధ్యకార్మికులు మంగళవారం సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించా రు. ఆమేరకు మున్సిపల్ ఈఈ శ్రీనివాసులకు విధుల్లో చేరుతున్న ట్లు నోటీసు ఇచ్చారు. ఈ సందర్భం గా మున్సిపల్ వర్కర్స్ యూనియన జిల్లా కార్యదర్శి విజయ్‌కుమార్ పట్టణ కార్యదర్శి సాల్మనలు మాట్లాడుతూ ప్రభుత్వ జీవో నెంబరు 36ను అమలు చేయకుండా కొత్తజీవో 124 ప్రకారం మూడు క్యాటగిరీల ఇంజనీరింగ్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు కేవలం మూడు వేలు మాత్రమే పెంచిందన్నారు. కార్మికులు ఈ జీతం పెంపుపై అసంతృప్తిగా ఉన్నారన్నారు. మంగళవారం విజయవాడ లో కార్మిక సంఘాలనేతలతో జరిగిన చర్చల మేరకు మున్సిపల్ ఉన్నతాధికారులు కార్మి కులు డిమాండ్లు అన్ని పరిష్కరించడానికి 10 రోజుల వ్యవధి కావాలని అప్పటి వరకు సమ్మె విరమించమని కోరడంతో తాత్కాలికంగా సమ్మె విరమించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన అధ్యక్షుడు గంగాధర్ రెడ్డి, కార్యదర్శి వెంకటేష్, బీటెక్ శివ, మహేంద్ర, పద్మ తదితరులు పాల్గొన్నారు.