Share News

క్వారీ తవ్వకాలను అడ్డుకున్న ముద్దిరెడ్డిపల్లె వాసులు

ABN , Publish Date - Aug 31 , 2025 | 11:56 PM

ముద్దిరెడ్డిపల్లె సమీపం లో చేస్తున్న క్వారీ తవ్వకాలను సో మవారం గ్రామస్థులు అడ్డుకున్నారు.

క్వారీ తవ్వకాలను అడ్డుకున్న ముద్దిరెడ్డిపల్లె వాసులు
క్వారీ తవ్వకాల వద్ద స్థానికులు

మైదుకూరు రూరల్‌, ఆగస్టు31(ఆం ధ్రజ్యోతి): ముద్దిరెడ్డిపల్లె సమీపం లో చేస్తున్న క్వారీ తవ్వకాలను సో మవారం గ్రామస్థులు అడ్డుకున్నారు. కొండను తవ్వి కంకర తీస్తున్న నేప థ్యంలో మోతాదుకు మించి డైనమే ట్లు పేల్చడం వలన ముద్దిరెడ్డిపల్లె గ్రామంలోని నివాసాలు నెర్రలు చీలిక లు రావడంతో ఆగ్రహించిన గ్రామస్థు లు క్వారీ తవ్వకాలను అడ్డకున్నారు. గతంలో కూడా కాంట్రాక్టర్‌ క్వారీ పనుల్లో మో తాదుకు మించి డైనమేట్లు పేల్చుతున్నారని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌కు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్పందించి తక్కువ మోతాదులో డైనమే ట్లు పేల్చుకోవాలని హెచ్చరించారు. కాని కాంట్రాక్టర్‌ అదే తీరున వ్యవహరిస్తుండటంతో గ్రామస్థులు పనులు నిలిపివేసి సమస్యను ఎమ్మెల్యే దృష్ఠికి తీసుకెళ్లినట్లు సమాచారం

Updated Date - Aug 31 , 2025 | 11:57 PM