Share News

ముళ్లపొదల నడుమ ఎంపీడీవో కార్యాలయం

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:58 PM

స్థానిక మండల ప్రజా పరిషత్‌ అభివృద్ధి కార్యాలయం ముళ్లపొదల న డుమ దర్శనమిస్తోంది.

ముళ్లపొదల నడుమ ఎంపీడీవో కార్యాలయం
ముళ్లపొదల నడుమ ఎంపీడీవో కార్యాలయం

ముద్దనూరు జూన్‌15(ఆంధ్రజ్యోతి): స్థానిక మండల ప్రజా పరిషత్‌ అభివృద్ధి కార్యాలయం ముళ్లపొదల న డుమ దర్శనమిస్తోంది. స్థానిక రైల్వే స్టేషన్‌ సమీపంలో మండల ప్రజా పరిషత్‌ అభివృద్ధి కార్యాలయం ఉంది. గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాంతాలలోని అండర్‌డ్రైనేజీ మురుగు నీరు ఎంపీడీవో కార్యాలయం పక్క నుంచి అటువైపు వెళుతుంటుంది. దీంతో ఎంపీడీవో కార్యాలయం ఒక పక్క రహదారి చుట్లూ కంపచెట్టు విపరీతంగా పెరిపోయి విషపురుగులు అధికంగా వస్తున్నాయని ఉద్యోగులు, సిబ్బందితోపాటు స్థానికులు పేర్కొంటున్నారు. ఇలాంటి చోటు నుంచి సమీపంలోని కాలనీకి ప్రజలు వెళ్లాలంటే ఒక పక్క విషపురుగులు, మరో పక్క మురుగునీరు దుర్వాసనతో హడలిపోతున్నారు.

Updated Date - Jun 15 , 2025 | 11:58 PM