Share News

మంత్రి నారాలోకేశ నిర్ణయం హర్షణీయం

ABN , Publish Date - Mar 13 , 2025 | 11:56 PM

మంత్రి నారా లోకేశ కాశినాయన క్షేత్రం పునర్నిర్మాణంపై తీసుకున్న నిర్ణయం గొప్ప విషయమని టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

మంత్రి నారాలోకేశ నిర్ణయం హర్షణీయం
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నేతలు

పోరుమామిళ్ల, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): మంత్రి నారా లోకేశ కాశినాయన క్షేత్రం పునర్నిర్మాణంపై తీసుకున్న నిర్ణయం గొప్ప విషయమని టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కాశినాయన క్షేత్రంలో జరిగిన సంఘటనపై స్పందించిన మంత్రి నారాలోకేశ తన సొంత నిధులతో పునర్నిర్మిస్తామని చెప్పడం హర్షణీయమని పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన, బి.కోడూ రు మండలాల టీడీపీ నేతలు మురుకూటి రాజారెడ్డి, మురుకూటి గుర్విరెడ్డి, మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన చెరుకూరి చెన్నరాయుడు, కొండా రామక్రిష్ణా రెడ్డి, మల్లిఖార్జునరెడ్డి, కొండా దుగ్గిరెడ్డి, శెట్టెం ప్రతాప్‌ తదితరులు పేర్కొన్నా రు. గురువారం పోరుమామిళ్లలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాశినాయన క్షేత్రంలో 2014లోనే నిర్మాణాలు నిలిపివేశారని, కానీ ఇటీవల జరిగిన పరిణామాలపై స్పందించిన బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువనేత రితీష్‌కుమార్‌ఱెడ్డి ఇక్కడి విషయాలను సీఎం చంద్ర బాబునాయుడు, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్‌, మంత్రి నారా లోకేశ దృష్టికి తీసుకెళ్లి వెంటనే నిర్ణయం తీసుకోవడానికి ఎంతో కృషి చేశారన్నారు .అలాగే రాత్రికి రాత్రే జ్యోతి క్షేత్రానికి బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవ డం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి వెంకటరెడ్డి, విజయభాస్క్రర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ నిధులతో అన్నదాన సత్రాలు పునర్నిర్మించాలి

ప్రభుత్వ నిధులతో అన్నదాన సత్రాలను ఇతర వసతులు పునర్నిర్మించాలని సీపీఎం రాష్ట్రకార్యదర్శి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు .బద్వేలు నియోజకవర్గంలోని కాశినాయన క్షేత్రానికి చెందిన స్నానపు గదులు, అన్నదా న సత్రాలు, గోశాల గెస్ట్‌హౌస్‌లను అటవీశాఖాధికారులు కూల్చివేయడం సమంజసం కాదన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 11:56 PM