ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపర్చాలి
ABN , Publish Date - Jun 19 , 2025 | 11:52 PM
ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవల ను ఇంకా బాగా మెరుగు పరుచుకోవాలని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వైద్య అధికా రులకు సూచించారు.
జిల్లా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీలో ఎమ్మెల్యే వరద
ప్రొద్దుటూరు , జూన 19 (ఆంధ్రజ్యోతి) : ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవల ను ఇంకా బాగా మెరుగు పరుచుకోవాలని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వైద్య అధికా రులకు సూచించారు. గురు వారం జిల్లా ప్రభుత్వ ఆసుప త్రిని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన ఓపీతోపాటు అన్ని వార్డు లలో పేషంట్లకు ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. రోగు లకు అందించే ఆహారం నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుప త్రికి వచ్చే రోగుల పట్ల వైద్యులు కానీ సిబ్బందికానీ మర్యాదపూర్వకంగా పలుకరించాలన వారిని అగౌరవ పరిచేరీతిలో వ్యవహరిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. రోగుల వద్ద సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని ఇది మానుకోకుంటే ఉద్యోగాలు ఊడుతాయని హెచ్చరించారు. ఈ తనిఖీలో ఎమ్మె ల్యే వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీవాణి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు బద్వేలు శ్రీనివాసులరెడ్డి ఉన్నారు.