Share News

వర్షాలు కురిపించమ్మా ! పోలేరమ్మకు పూజలు

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:41 PM

చల్లంగా చూడమ్మా! వర్షాలు కురిపించి పొలాలను సస్యశ్యామలం అయ్యేలా చేయ మ్మా! అంటూ మండలంలోని బుచ్చంపల్లె గ్రామస్థులు గ్రామదేవత పోలేరమ్మకు ఆదివారం పూజలు నిర్వహించారు.

 వర్షాలు కురిపించమ్మా !  పోలేరమ్మకు పూజలు
పూజలునిర్వహిస్తున్న భక్తులు

పోరుమామిళ్ల, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : చల్లంగా చూడమ్మా! వర్షాలు కురిపించి పొలాలను సస్యశ్యామలం అయ్యేలా చేయ మ్మా! అంటూ మండలంలోని బుచ్చంపల్లె గ్రామస్థులు గ్రామదేవత పోలేరమ్మకు ఆదివారం పూజలు నిర్వహించారు. పోరు మామిళ్ల మండలంలోని బుచ్చంపల్లెలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ జరిగి 41 రోజులు పూర్తి కావస్తున్న సందర్భంగా ఆది అమ్మవారికి గ్రామస్థులంతా భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం బంధువులు, స్నేహితులతో కలిసి విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు హాజరయ్యారు.

Updated Date - Jul 20 , 2025 | 11:41 PM