పాముకాటుతో వ్యక్తి మృతి
ABN , Publish Date - May 19 , 2025 | 11:25 PM
మండలంలోని మద్దిరేవుల పంచాయతీలోని రెడ్డివారిపల్లెకు చెందిన వీరబల్లి వెంకట్రమణ (44) సోమవారం పాముకాటుకు గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
లక్కిరెడ్డిపల్లె, మే 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మద్దిరేవుల పంచాయతీలోని రెడ్డివారిపల్లెకు చెందిన వీరబల్లి వెంకట్రమణ (44) సోమవారం పాముకాటుకు గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. వారి వివరాల మేరకు.. మృతుడు వెంకట్రమణ రోజు కూలి పనికి వెళ్లి జీవనం సాగించేవాడని, ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తుండగా కట్లపాము వచ్చి కాటు వేసిందని, దీంతో హుటాహుటిన స్థానికులు వెంకట్రమణను రాయచోటి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారని, భార్య జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లిందని తెలిపారు. కుటుంబ సభ్యులు, పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు.