పిల్లలతో పని చేయించడం చ ట్టరీత్యా నేరం
ABN , Publish Date - Jun 12 , 2025 | 11:48 PM
14 సంవత్సరాల లోపల పిల్లలతో పనిచేయించడం చట్టరీత్యా నేరమని మండల విద్యాధికారి నాగరాజు పే ర్కొన్నారు.
గాలివీడు, జూన12(ఆంధ్రజ్యోతి): 14 సంవత్సరాల లోపల పిల్లలతో పనిచేయించడం చట్టరీత్యా నేరమని మండల విద్యాధికారి నాగరాజు పే ర్కొన్నారు. గురువా రం మండలంలోని పక్కీరెడ్డిగారిపల్లెలో బాలకర్మిక వ్యతిరేక దినోత్సవం రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలకార్మిక చట్టం ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం, ప్రమాదకమైన పనుల్లో ఉపయోగించడం పని చేయించడం నేరం కావున బడిలో చదువు కోవాల్సిన వయస్సులో పిల్లలతో పని చేయించడం నేరం కావున పిల్లలను తల్లిదండ్రులు బాగా చదివించాలని చదువు ద్వారానే పిల్లలు అభివృద్ధి చెందుతారని తెలియజేశారు. కలందర్, న్యాయవాది కిరణ్‌కుమార్, పోలీసు గుణపతిరాజు సిబ్బంది, రెడ్స్ ఇబ్బంది పాల్గొన్నారు.