Share News

యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయండి

ABN , Publish Date - Jun 20 , 2025 | 11:19 PM

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నేడు జరిగే యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి, డీపీవో రాధమ్మ, ఎంపీడీవో రామచంద్ర పిలుపునిచ్చారు.

యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయండి
సంబేపల్లి : సమావేశంలో మాట్లాడుతున్న ప్రత్యేక అధికారి డీపీవో రాధమ్మ

సంబేపల్లె, జూన20(ఆంధ్రజ్యోతి): ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నేడు జరిగే యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి, డీపీవో రాధమ్మ, ఎంపీడీవో రామచంద్ర పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని మండల పరిషత కార్యాలయ సభాభవనంలో యోగాంధ్ర కార్యక్రమంపై సమావేశం ఏర్పాటు చేశారు. మండల వ్యాప్తంగా ప్రతి సచివాలయం వద్ద 115 మంది యోగా ట్రైనర్లచే ఒక్కొక్క సచివాలయం వద్ద 150 మంది సభ్యులతో ఉదయం 6 గంటల నుంచి 8 వరకు యోగా నిర్వహించాలన్నారు. సమావేశానికి మండల స్థాయి అధికారులు, సచివాలయ ప్రత్యేక అధికారులు, సిబ్బంది, వెలు గు, ఉపాధి సిబ్బంది, మెడికల్‌ సిబ్బంది యో గాంధ్ర ట్రైనర్స్‌ హాజరయ్యారు.

Updated Date - Jun 20 , 2025 | 11:19 PM