ప్లీనరీని జయప్రదం చేయండి
ABN , Publish Date - Jun 30 , 2025 | 11:55 PM
విద్యారంగ సమస్యలపై ఈ నెల 23, 24వ తేదీల్లో కడపలో జరగనున్న రెవల్యూషనరీ స్టూడెంట్ ఫోరం (ఆర్‌ఎ్‌సఎఫ్) రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేసు యాదవ్ పిలుపునిచ్చారు.
రాయచోటిటౌన, జూన 30 (ఆంధ్రజ్యోతి): విద్యారంగ సమస్యలపై ఈ నెల 23, 24వ తేదీల్లో కడపలో జరగనున్న రెవల్యూషనరీ స్టూడెంట్ ఫోరం (ఆర్‌ఎ్‌సఎఫ్) రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేసు యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం రాయచోటి ప ట్టణంలోని ప్రభుత్వ పాలటెక్నిక్ కళాశాలలో విద్యార్థులతో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షి్‌పలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేటు, కార్పొరేట్ పాఠలశాలల ఫీజుల దోపిడీపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలకు, జూనియర్ కాలేజీలు, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీలకు నిధులు కేటాయించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎ్‌సఎఫ్ నాయకులు అష్రఫ్, బాదుల్లా, కల్యాన, ఫైజాన, కార్తీక్, శివ తదితరులు పాల్గొన్నారు.