మహానాడును విజయవంతం చేయాలి
ABN , Publish Date - May 24 , 2025 | 11:05 PM
కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ రైల్వేకోడూరు ఇనచార్జ్, కుడా చైౖర్మన ముక్కా రూపానందరెడ్డి పిలుపునిచ్చారు.
కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి
రైల్వేకోడూరు, మే 24(ఆంధ్రజ్యోతి): కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ రైల్వేకోడూరు ఇనచార్జ్, కుడా చైౖర్మన ముక్కా రూపానందరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆ యన కడపలో మహానాడు వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహానాడు ఏర్పాట్లు చివరి దశకు చే రుకున్నాయన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మం త్రులు నిమ్మల రామానాయుడు, సంధ్యారాణి, అనగాని సత్యప్రసాద్ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గం నుంచి మహానాడుకు పదివేల మం ది కార్యకర్తలు తరలి వెళ్లేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఆయనతో పాటు టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్, కూటమి నాయకులు బత్తిన వేణుగోపాల్‌రెడ్డి, కస్తూరి దినేష్ తదితరులు పాల్గొన్నారు.