Share News

గంగ ఒడికి చేరిన గణనాథులు

ABN , Publish Date - Aug 31 , 2025 | 12:01 AM

వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథులు శనివారం గంగమ్మ ఒడి చేరారు.

గంగ ఒడికి చేరిన గణనాథులు
నిమజ్జనానికి వెళుతున్న గణపయ్యలు

ప్రొద్దుటూరు/ టౌన్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథులు శనివారం గంగమ్మ ఒడి చేరారు. ప్రొద్దు టూరులో గణేశ నిమజ్జనా కార్యక్రమాలు ఉత్సవ విగ్రహ కమిటీలు భారీ ఎత్తున చేపట్టాయి. శనివారం పట్టణంలోని అనేక ప్రాంతాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో డప్పు వాయిద్యాలతో రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గణేశ నిమజ్జనం పాల్గొన్నారు. అనేక మండపాల వద్ద మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు నృత్య పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నారు. శనివారం మిట్టమడివీధిలోని 8వ నంబరు వీధిలో యువతరంగం వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చిన్నారులకు శాస్త్రీయ నృత్య పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. పీడబ్ల్యూడీ కార్యాలయం వద్ద మధ్యాహ్నం రెండు వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. స్వామివారి నిమజ్జనం సందర్భంగా కోలాటం, చెక్కభజన వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

పెద్దముడియంలో రక్తదాన శిబిరం

పెద్దముడియం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): పెద్దముడియం మండలం సుద్దపల్లె గ్రా మానికి చెందిన యువకులు వినాయకచవితి సందర్భంగా శనివారం గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదానశిబిరాన్ని రూరల్‌ సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐ సుబ్బారావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ భాస్కర్‌రెడ్డి మాట్లాడు తూ పండుగ సందర్భంగా ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడ ం వినూత్న ఆలోచనన్నారు. సుద్దపల్లెకు చెందిన యూత ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ బ్లడ్‌ డోనర్స్‌ టీం సహకారంతో ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని గ్రామానికి చెందిన యువకులు శేషు, బాలు తదితర యువకులను సీఐ అభినందించారు. ఈ శిబిరంలో సేకరించిన రక్తాన్ని నంద్యాల బ్లఢ్‌ సెంటరు నిర్వాహకులకు అందించారు.

నిమజ్జనానికి తరలివెళ్లిన గణపయ్యలు

జమ్మలమడుగు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగులో శనివారం వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం ట్రాక్టర్లలో తరలివెళ్లారు. జమ్మలమడుగు, మోరగుడి, గూడెం చెరువు తదితర ప్రాంతాల నుంచి నిమజ్జనానికి వినాయక విగ్రహాలను భక్తులు తరలించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వెంట రంగులు చల్లుకుంటూ చిందులు వేస్తూ మేళాల మధ్య తరలివెళ్లారు.

మైలవరంలో: మండల పరిధిలోని వేపరాల, దొమ్మరనంద్యాల, మైలవరం, తదితర గ్రామాల్లోని వినాయక విగ్రహాలకు భక్తిశ్రద్ధలతో శనివారం నిమజ్జనం చేశారు. రంగులు చల్లుకుంటూ పురవీధుల్లో చిందులేస్తూ చిన్నారులు, పెద్దలు ఆనందోత్సాహాల మధ్య ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం చేశారు. మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

Updated Date - Aug 31 , 2025 | 12:01 AM