Share News

భూకబ్జాదారుల నుంచి శ్మశాన స్థలం విముక్తి

ABN , Publish Date - Jun 11 , 2025 | 11:48 PM

మం డల కేంద్రంలోని సోమిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ లో సర్వే నెం.464లో 10.5 ఎకరాల శ్మశాన స్థలా నికి భూకబ్జాదారుల నుంచి విముక్తి లభించింది.

 భూకబ్జాదారుల నుంచి శ్మశాన స్థలం విముక్తి
ఆక్రమణకు గురైన స్థలాన్ని చదను చేసిన దృశ్యం

హర్షం వ్యక్తం చేసిన సోమిరెడ్డిపల్లె వాసులు

బ్రహ్మంగారిమఠం, జూన 11 (ఆంధ్రజ్యోతి) : మం డల కేంద్రంలోని సోమిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ లో సర్వే నెం.464లో 10.5 ఎకరాల శ్మశాన స్థలా నికి భూకబ్జాదారుల నుంచి విముక్తి లభించింది. ఇటీవల మైదుకూరు పుట్టా సుధాకర్‌యాదవ్‌తోపాటు జిల్లా కలెక్టర్‌ దృష్టికి జనచైతన్య సంస్థ నాయకుడు తిప్పన బాలనాయుడుతో పాటు గ్రామ ప్రజలు తీసుకు నివె ళ్లారు. మంగళవారం ఎమ్మెల్యే చొరవతో బద్వేలు ఆర్డీవో ఆక్రమించుకున్న వారిని పిలి పించి వారి రికార్డు లను పరిశీలించగా తమకేమీ ఈ శ్మశాన స్థలంలో హక్కు లేదని ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో బుధవారం సోమిరెడ్డిపల్లెతో పాటు కందిమల్లయ్యపల్లె, వీరభ ద్రాపురం, వీరనారాయణపురం, ప్రభునగర్‌ పాతూరు, కొత్తూరు, మఠం సెంటరు, పోలేర మ్మనగర్‌ తదితర చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజ లు తరలివచ్చి భూక బ్జాకు గురైన స్థలాన్ని ఎక్స్‌కవేటర్‌ ద్వారా చదను చేయించారు. ఇందుకు సహకరించిన జిల్లా కలెక్టరు చెరుకూరి శ్రీధర్‌, ఆర్డీఓ చంద్రమోహన, ఎమ్మె ల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌కు దన్యవాదాలు తెలిపారు.

Updated Date - Jun 11 , 2025 | 11:48 PM