ప్రజల్లోకి వెళదాం... ప్రగతిని తెలియజేద్దాం
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:06 AM
ప్రజల్లోకి వెళదాం, ప్రగతిని తెలియజే ద్దామని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, నియోజకవర్గ ఇనచార్జి రితేష్‌కుమార్ రెడ్డి, బొజ్జా రోశన్న, డీసీసీబీ చైర్మనలు సూర్యనారాయణరెడ్డిలు పేర్కొన్నారు.

బద్వేలుటౌన, జులై 1 (ఆంధ్రజ్యోతి) : ప్రజల్లోకి వెళదాం, ప్రగతిని తెలియజే ద్దామని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, నియోజకవర్గ ఇనచార్జి రితేష్‌కుమార్ రెడ్డి, బొజ్జా రోశన్న, డీసీసీబీ చైర్మనలు సూర్యనారాయణరెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యక ర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభు త్వం చేపట్టిన మంచికార్యక్రమాలను, పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం పూర్తిగా నాశనమైందని, కూటమి ప్రభుత్వం రాకతో ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ఎదుగుతూ రాష్ర్టానిగాడిలో పెడుతూ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు. రాబోయే నాలుగుఏళ్ల్లలో కూటమి ప్రభుత్వం చేయనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెల్లేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈఏడాది సుపరిపాలన అంతా జనరంజకమేనని, అభి వృద్ధి, సంక్షేమమే సుపరిపాలన తొలిఅడుగు నినాదంతో ఇంటికి తెలుగుదేశం కార్యక్ర మాన్ని శ్రీకారం చుడుతున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.