Share News

కన్వర్షన లేకుండానే భూ విక్రయాలు

ABN , Publish Date - Jul 21 , 2025 | 11:38 PM

పోరుమామిళ్ల మండలంలో ఎటు వంటి కన్వర్షన లేకుండానే వ్యవసాయ భూములు రియల్‌ ఎస్టేట్‌గా మారు తున్నాయి.

కన్వర్షన లేకుండానే భూ విక్రయాలు
పోరుమామిళ్లలో వెంచర్లు

రియల్‌ ఎస్టేట్‌గా మారుతున్న వ్యవసాయ భూములు రెవెన్యూ ఆదాయానికి భారీగా గండి పట్టించుకోని అధికారులు

పోరుమామిళ్ల, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : పోరుమామిళ్ల మండలంలో ఎటు వంటి కన్వర్షన లేకుండానే వ్యవసాయ భూములు రియల్‌ ఎస్టేట్‌గా మారు తున్నాయి. అంతేకాక చాలామంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు డీకేటి భూ ములను కూడా రియల్‌ ఎస్టేట్‌గా మార్చుకుంటున్నారు. ఇంత జరుగుతు న్నా సంబంధిత అధికారులు రాజకీయ కారణాలు ఏమో తెలియదు కానీ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సం బంధించి అనుమతులు పొందాల్సి ఉన్నా అధికారులు అప్పుడప్పుడూ తని ఖీలు చేసి నోటీసులు ఇచ్చి పెనాల్టీ కడుతున్నారే తప్ప పూర్తిస్థాయిలో మండ లంలో ఎన్ని లేఅవుట్లను వేశారు, లేఅవుట్లకు సంబంధించి రియల్‌ ఎస్టేట్‌ భూములు ఎంత విస్త్ణీర్ణంలో వేశారు. డీకేటి భూములు కూడా రియల్‌ ఎసే ్టట్‌గా మలుచుకుంటున్నారా? అనే వివరాలపై విచారణ చేయడంలేదు. ము ఖ్యంగా పోరుమామిళ్ల, రంగసముద్రం పంచాయతీలకు సంబంధించి వందల ఎకరాలు ప్రస్తుతం వ్యాపారాలు ఉన్నా లేకున్నా దాదాపు పదేళ్ల నుంచి వ్యవ సాయభూములను రియల్‌ ఎస్టేట్‌ భూములుగా మలిచారు. ఆదిఆంధ్రపా లెం సమీపంలో తిప్పల వద్దకు కూడా వెంచర్లు వేశారు. అయితే వాటికి అనుమతులు ఉన్నాయా లేవా అని ప్రశ్నించే నాఽథుడు లేడు. ఎవరైనా పంచాయతీలో కానీ, గ్రామాల్లో కానీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవారు పంచాయతీ అనుమతులు సంబంఽధిత అధికారులతో అనుమతులు తీసుకో వాలి. కానీ ఈ కన్వర్షన లేకుం డానే అమ్మకాలు జరుపుతున్నారు. దీని వల్ల ప్లాట్లను కొనుగోలు చేసిన వారు తిరిగి గృహాలు నిర్మించుకోవాలంటే కన్వ ర్షనకు డబ్బులు చెల్లించాల్పి ఉంటుంది. దీని వల్ల రెవెన్యూ, పంచాయతీల ఆదాయానికి గండి పడుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపడితే ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశాలు న్నాయి. ఇప్పటికైనా అనఽధికారిక వెంచర్లపై సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

50 మందికి నోటీసులిచ్చాం

పోరుమామిళ్ల మండలంలో అనుమతులు లేకుండా వేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు 50 మందికి నోటీసులిచ్చాం. వారి నుంచి స్పందనలేకపోవడంతో బద్వేలు ఆర్డీవో చంద్రమోహనకు రిపోర్టు చేశాం.

-చంద్రశేఖర్‌రెడ్డి, తహసీల్దార్‌, పోరుమామిళ్ల

Updated Date - Jul 21 , 2025 | 11:39 PM