పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:39 PM
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతిఒక్కరి బాధ్యతగా వ్యవహరించాలని మున్సిపల్ కమిషనర్ జి.శ్రీనివాసులు తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు
రాజంపేట టౌన, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతిఒక్కరి బాధ్యతగా వ్యవహరించాలని మున్సిపల్ కమిషనర్ జి.శ్రీనివాసులు తెలిపారు. శనివారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పరిశుభ్రతను పరిశీలించారు. పట్టణంలోని ప్రజలు తమ ఇళ్లు, షాపుల్లోని చెత్తను బాధ్యతారాహిత్యంగారోడ్లపై, కాలువల్లో పడవేస్తున్నారన్నారు. వాటిని మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసిన చెత్తకుండీల్లో వేయడం లేదన్నారు. దీంతో పారిశుధ్య కార్మికులు శ్రమిస్తున్నా ఫలితం కనిపించడం లేదన్నారు. కావున ప్రతిఒక్కరూ కుండీల్లో వేయాలని, లేకపోతే కార్మికులకు అందించాలని కోరారు. రాజంపేట మున్సిపాలిటీని క్లీన సిటీగా మారుద్దామన్నారు.