కన్నెలవాగు చెరువుకు కేసీ నీరు విడుదల
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:59 PM
స్థానిక ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ తెలుగుగంగ నీటికి పూజలు చేసి కన్నెలవాగు చెరువుకు వదిలారు.
ఖాజీపేట, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ తెలుగుగంగ నీటికి పూజలు చేసి కన్నెలవాగు చెరువుకు వదిలారు. ఈ సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతన్నలు దేశానికి వెన్నముక్కలాంటివారని కూటమి ప్రభుత్వం ప్రతి సెంటుకు నీరు అందించడమే ధ్యేయమన్నారు. శ్రీశైలం నుంచి ఎన్నడు లేని విధంగా జూలై మాసంలోనే కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేయడం చారిత్రకమన్నారు. నియోజకవర్గంలోని ప్రతి చెరువుకు నీరు నింపడం వలన సాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండవన్నారు. గత ప్రభుత్వం ముందుచూపు లేక రైతన్నలకు నీరు అందించడంలో విఫలమైందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు లక్ష్మిరెడ్డి, మార్కెట్‌యార్డు కమిటీ ఛైర్మన్ రవీంద్ర, టీడీపీ నాయకులు బొగ్గుల చంద్ర ఓబుళరెడ్డి, చంద్రబాస్కర్‌రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, వాకమల్ల వెంకటరామిరెడ్డి, దుంపలగట్టు రవి తదితరులు పాల్గొన్నారు.