కమనీయం.. కొండ వేణుగోపాలస్వామి కల్యాణం
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:41 PM
అట్లూరు మండలంలోని కొండూరు పడమటిభా గం లంకమల అభయారణ్యంలో వెలసిన మూలవిరాట్ కొండగోపాలస్వామి ఆల యం లో శ్రావణమాస శనివారాలు పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త బి.నందగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా, కమనీయంగా నిర్వహించారు.
్ఞఅట్లూరు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): అట్లూరు మండలంలోని కొండూరు పడమటిభా గం లంకమల అభయారణ్యంలో వెలసిన మూలవిరాట్ కొండగోపాలస్వామి ఆల యం లో శ్రావణమాస శనివారాలు పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త బి.నందగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా, కమనీయంగా నిర్వహించారు. కడప, అన్నమయ్య, నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల నుంచి గోపాలస్వామి కొం డపైకి భక్తులు వెళ్లి అక్కడ గుడి పక్కన ఉన్న జలపాతంలో స్నానాలు ఆచరించి కొండ గొపాలస్వామికి భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు పాటూ రు రాధాక్రిష్ణారెడ్డి, సింగనపల్లెసుబ్బారెడ్డి, పాలకొండ గోపాల్‌రెడ్డి, బోవిళ్లరాజ గోపాల్ రెడ్డి, బంగారు అంగడి వెంకటేశ్వర్లు కొండలోనిర్వహించే సాంస్కృతిక కార్యక్ర మాలు, అన్నదాన కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా భక్తులకు అన్ని సదుపాయాలు సమకూర్చడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రాత్రికి రుక్మిణీ సత్యభామ వేణుగోపాలస్వామిని రథంపై అలంకరించికోలాటలాధ్య గ్రామోత్సవం నిర్వ హించారు..
లక్ష్మీనరసింహుడికి శ్రావణమాస పూజలు
బద్వేలు రూరల్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): వల్లెరవారి పల్లె గామంలో వెలసిన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వా మి ఆలయంలో శనివారం శ్రావణమాస నాలుగో శనివా రం పురస్కరించుకుని విశేషపూజలు, అభిషేకాలు వైభవం గా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి వెండి ఆభరణాలతో పలు రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకర ణచేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు పెంచలయ్యస్వామి మాట్లాడు తూ ఈ నెల 23న శ్రావణ అమావాస్య పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజాభిషేకాలు, అలాగే శాకాంబరి అలంకారంలో స్వామివారి దర్శనం ఉంటుందన్నారు. మధ్యా హ్నం భక్తులకు అన్నదాన కైంకర్యం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.