కడప కార్యకర్తల బలం నిరూపించాలి
ABN , Publish Date - May 24 , 2025 | 12:02 AM
కడప జిల్లాలో టీడీపీ కార్యకర్తల బలమేమిటో నిరూపించేలా మే 27, 28, 29 తేదీలలో కడపలో జరిగే మహానాడుకు తరలిరావాలని ఎమ్మె ల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పిలు పునిచ్చారు.
ప్రొద్దుటూరు, మే 23 (ఆంధ్రజ్యోతి) : కడప జిల్లాలో టీడీపీ కార్యకర్తల బలమేమిటో నిరూపించేలా మే 27, 28, 29 తేదీలలో కడపలో జరిగే మహానాడుకు తరలిరావాలని ఎమ్మె ల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పిలు పునిచ్చారు. శుక్రవారం స్ధానిక టీడీపీ కార్యాలయంలో మాజీ కౌన్సిలర్ బుక్కపట్నం జయశంకర్ ఆధ్వర్యంలో మహానాడుకు తరలిరావాలని వేసిన పోస్టర్లను ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆవిష్కరిం చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానాడు విజయవంతం కోసం జయ శంకర్ రెండువేల పోస్టర్స్ స్కిక్కర్స్ వేయించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యకర్తలు పార్టీకి పునాదిలాంటి వారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య, మాజీ టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఘంటశాల వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు