కూటమి ప్రభుత్వంలోనే ప్రజలందరికీ న్యాయం
ABN , Publish Date - Jul 04 , 2025 | 10:52 PM
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ప్రజలందరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రైల్వేకోడూరు తెలుగుదేశం పార్టీ ఇనచార్జి, కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి అన్నారు.

కుడా ఛైర్మన ముక్కా రూపానందరెడ్డి
పుల్లంపేట, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ప్రజలందరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రైల్వేకోడూరు తెలుగుదేశం పార్టీ ఇనచార్జి, కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అనంతయ్యగారిపల్లె, కొట్టాలుపల్లె, యూవీ అగ్రహారం, దండ్లోపల్లె, కోనయ్యగారిపల్లె, కొత్తపేట, వేల్పులవారిపల్లె గ్రా మాల్లో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన జయప్రకాష్, మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన నేలపాటి రామచంద్రనాయుడు, చంద్రశేఖర్‌నాయుడు, పోలూరు కృష్ణమనాయుడు, లింగుట్ల వెంకటరమణనాయుడు, కుప్పాల రామకృష్ణయ్య, చిన్నం శివయ్య, సంజయ్‌గాంధీ, మహిళా నాయకురాలు సౌభాగ్యవతి, మారోతి మల్లి తదితరులు పాల్గొన్నారు.