జయ జయహే.. మహిషాసురమర్దిని
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:51 PM
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం 9వ రోజు మహిషాసురమర్ధిని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
ప్రొద్దుటూరు టౌన్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం 9వ రోజు మహిషాసురమర్ధిని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిశాల, రతనాల వేంకటేశ ్వరస్వామి ఆలయం, శివాలయం, రాజరాజేశ్వరీదేవి ఆలయం, మోడంపల్లె పెద్దమ్మ తల్లి ఆలయాల్లో మహిషాసురమర్ధిని అలంకారం నిర్వహించారు. చెన్నకేశవస్వామి ఆలయంలో కాళింగమర్ధిని అలంకారంలో, రామేశ్వరంలోని ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయంలో దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని మొక్కుకున్నారు.
జమ్మలమడుగులో: జమ్మలమడుగులో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి మహిషాసురమర్ధినిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కన్యతీర్థంలోని శ్రీ బాలత్రిపురసుందరీదేవి మహిషాసురమర్ధిని అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఎర్రగుంట్లలో: దసరాశరన్నవరాత్రుల ఉత్స వాల్లో బాగంగా లోకపావని, జగజ్జనని మహిషాసురమర్ధిని అలంకారంలో భక్తులకు మంగళవారం దర్శనమిచ్చారు. వాసవాంబ, ఏరువాకగంగమ్మ, చౌడేశ్వరీదేవి, శ్రీమహాఅం కమ్మ, పార్వతీదేవీ అమ్మవార్లు శ్రీమహిషాసు రమర్ధిని అలంకారంలో దర్శనమిచ్చారు. మహా అంకమ్మ ఆలయంలో చంఢీయాగం నిర్వహించారు. అర్బనసీఐ విశ్వనాథరెడ్డి తం పతులు యాగంలో పాల్గొన్నారు. సాయం త్రం కుంకుమార్చన, పూజలు చేశారు.
బద్వేలుటౌనలో : పట్టణంలోని అమ్మవారి శాలలో మహిషాసురమర్దినీదేవి అలంకారం లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కోదండరామస్వామి ఆలయంలో లక్ష్మీదేవి గా, మహాలక్ష్మిదేవి ధైర్యలక్ష్మిదేవిగా, దుర్గమ్మదేవి మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమి చ్చారు. పట్టణంలోని అమ్మవారిశాలలో వాసవీమాతను మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి రితేషకుమార్ రెడ్డిలు దర్శించుకున్నారు. వారికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొండపల్లె చిన్నసుబ్బా రావు, కమిటీసభ్యులు ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.