Share News

ధర్నాల డ్రామా ఆడుతున్న జగన్‌ ముఠా

ABN , Publish Date - Jun 02 , 2025 | 11:19 PM

మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన ముఠా ధర్నాల డ్రామా ఆడుతున్నారని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి విమర్శించారు.

ధర్నాల డ్రామా ఆడుతున్న జగన్‌ ముఠా
మాట్లాడుతున్న టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి

జమ్మలమడుగు, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన ముఠా ధర్నాల డ్రామా ఆడుతున్నారని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి విమర్శించారు. సోమవారం జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కుంభకోణాల నుంచి ప్రజాదృష్టి మళ్లించడానికి ధర్నాల డ్రామా ఆడుతున్నారన్నారు. జగన్‌ ప్రభుత్వంలో తొలి ఏడాదిలోనే 10 శాతం హామీలు కూడా అమలు చేయలేదని విమర్శించారు. జగన్‌ కాంగ్రెస్‌ను అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దోచుకుని అదే పార్టీకి వెన్నుపోటు పొడిచి. శివకుమార్‌ స్థాపించిన వైసీపీని కబ్జా చేసి ఆయనకు వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే మొదటినెలలోనే నాలుగు వేల పెన్షన్‌ ఇచ్చి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టీడీపీ నాయకులు మోహన్‌రెడ్డి, బ్రహ్మనందరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 11:19 PM