‘జగనకు లిక్కర్‌స్కాం భయం పట్టుకుంది’
ABN , Publish Date - May 23 , 2025 | 11:37 PM
మాజీ సీఎం జగనమోహనరెడ్డికి లిక్కర్‌స్కాం భ యం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమే్‌షనాయుడు తెలిపారు.
రాజంపేట, మే 23 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగనమోహనరెడ్డికి లిక్కర్‌స్కాం భ యం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమే్‌షనాయుడు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం వ్యవహరించారన్నా రు. ఆర్థిక నేరాలకు కేరాఫ్ అడ్రస్ జగనరెడ్డి అండ్ కో అన్నారు. నాడు చేసిన ఆర్థిక నేరాలకు నేడు పరాకాష్ట వహించాల్సి వస్తుందని, ముందుగానే మీడియా ముందుకు వచ్చి తాను హరిశ్చంద్రుడని, తనకు ఏమీ సంబంధం లేదని తెలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మద్యపానం నిషేధిస్తామని చెప్పి మోసంచేసి అధిక రేట్లకు అమ్మి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు వీవీ రమణ, బీజేపీ రాష్ట్ర నాయకులు హిమగిరియాదవ్ తదితరులు పాల్గొన్నారు.