ఆరుతడి పంటలపై ఆసక్తి
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:56 PM
ఖరీఫ్ సీజన ప్రారంభమై నెలరోజులు దాటినా నైరుతి కరుణించకపోవడంతో రైతన్నలు ఆరుతడి పంటలపైన ఆసక్తి చూపుతున్నారు.
దువ్వూరు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన ప్రారంభమై నెలరోజులు దాటినా నైరుతి కరుణించకపోవడంతో రైతన్నలు ఆరుతడి పంటలపైన ఆసక్తి చూపుతున్నారు. దువ్వూరు మండలంలో రైతులు మినుము, మొక్కజొన్న పంటలను విస్తృతంగా సాగు చేస్తున్నారు. ఈ పంటలు వేయడానికి పెట్టుబడులు తక్కువ కావడంతో సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఖరీఫ్ సీజన్‌గా పంట పెట్టడానికి ముందే విత్తనాలు సేకరించుకున్న రైతులు సేద్యాలు చేసి విత్తనం వేశారు. ఆరుతడులుగా అప్పుడప్పుడు నీటిని అందిస్తే పంట చేతికొచ్చే అవకాశం ఉంది. ఈ నేపఽథ్యంలో మినుము చాలా మంది వేయగా మొక్కజొన్నను కూడా సాగు చేశారు. ఇప్పటి వరకు ఖరీఫ్ పంటగా మినుము 250 ఎకరాలు, మొక్కజొన్న, జొన్న కలిపి 270 ఎకరాల్లో సాగైనట్లు మండల వ్యవసాయ శాఖ రికార్డులో నమోదైంది. మినుము పంట గత సంవత్సరం 700 ఎకరాలుగా సాగు చేశారు. అప్పట్లో సరైన దిగుబడులు అందక రైతులు కొందరికి అతి కష్టంగా పెట్టుబడులు దక్కాయి. మరికొందరు రైతులు మాత్రం లాభాలు గడించారు. క్వింటాలు మినుము ధర రూ.8,500 ఽ పలికింది. బాగా పండితే ఆదాయం బాగుంటుందని రైతులు అంటున్నారు. క్రాసింగ్‌జొన్న వేసిన రైతుల వద్ద నుంచి విత్తన కంపెనీలు క్వింటా రూ.6 వేలు దాకా చెల్లించి కొనుగోలు చేసింది. మొక్కజొన్నను ప్రత్యేంగా కొనుగోలు చేయడం జరిగింది. జొన్నలను రూ.2,500 ధర చెల్లించి కొనుగోలు చేశారు. సాగు ఖర్చులు తక్కువ, నీరుతడులు కూడా పంటకు తగిన మేర అం దిస్తే ప్రయోజనం ఉంటుందన్న నేపథ్యంలో మినుము, మొక్కజొన్న పంట లు మంచి ఫలితాలు ఉంటాయని రైతులు అభిప్రాయ పడుతున్నారు.