Share News

ఇష్టారాజ్యంగా అక్రమ లేఅవుట్లు

ABN , Publish Date - Aug 23 , 2025 | 11:48 PM

గత వైసీపీ ప్రభుత్వంలో బద్వేలులో ఇష్టారాజ్యంగా అక్రమ లే అవుట్లు వెలిశాయి..

ఇష్టారాజ్యంగా అక్రమ లేఅవుట్లు
అనధికార లే అవుట్లను పరిశీలిస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌

బద్వేలులో 70 ఎకరాల్లో 16 అక్రమ వెంచర్లు గుర్తించిన అఽధికారులు విక్రయిస్తే చర్యలు తప్పవంటున్న మున్సిపల్‌ కమిషనర్‌

బద్వేలు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో బద్వేలులో ఇష్టారాజ్యంగా అక్రమ లే అవుట్లు వెలిశాయి.. రియల్‌ఎస్టేట్‌ పేరుతో కొం దరు దందా సాగించారు. అనుమతులు లెక్క చేయకుండా లే అవుట్లు వేసి అక్రమమార్గంలో డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో యథేచ్ఛగా అక్రమ లే అవుట్లు వేశారు. ఇలాంటి వెంచర్లు, అక్రమాలపై కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే చర్యలకు ఉపక్రమించిన కొందరు అధికారులు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వాటిపైచర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారన్న విమర్శ లున్నాయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే భూ ఆక్రమణలు, అక్ర మ లే అవుట్లపై చర్యలు ఉంటాయనుకున్నా ఆ స్థాయిలో అధికారులు ఆక్ర మణలపై చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తుండడంపై పలు విమర్శ లకు తావిస్తోంది. బద్వేలులో దాదాపు 70 ఎకరాలలో 16 అక్రమ లే అవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే వాటిపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. బద్వేలు పట్టణం రోజురోజుకు విస్తరిస్తోంది. మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి స్థలాలకు గిరాకీ ఏర్పడింది. ఈ నేప థ్యంలో బద్వేలు, గోపవరం మండలాలలో అక్రమంగా యథేచ్ఛగా ఇష్టాను రాజ్యంగా వెంచర్లు వేసినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి వెంచర్లను పరిశీలిస్తే గోపవరం మండలం మడకలవా రిపల్లెలోని 795/2 సర్వేనెంబరు లో మూడు ఎకరాలలో అక్రమ లే అవుట్లు వెలిశాయి. బద్వేలు మండలం లోని 1156-1, 1156-2, 1156-3, 3.34 ఎకరాలు, అలాగే గుంతపల్లె మండ లంలోని సర్వే నెంబరు 614-1ఎ, 1బి, 1సి, 1డి, 1ఈ, 630, 631, 632, 633, 634, 635, 636, 637-1.24లతో పాటు చెన్నంపల్లెలోని 1580లో 16.5 ఎకరా లు, గుంతపల్లెలోని 628లో 2.48 ఎకరాలలో అనధికార లే అవుట్లు వెలిశాయి ఈ అక్రమ లే అవుట్లపై అధికారులు ఏవిధమైన చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే.

అక్రమ లే అవుట్లపై చర్యలు తప్పవు

అనధికార అక్రమ లే అవుట్లలో స్థలం లేదా ప్లాట్లు వేసినా చట్ట విరుద్ధమని వాటిపై చర్యలు తప్పవు. ప్లాట్ల అమ్మకం, కొనుగోలు వీలు లేకుండా రిజిస్ర్టేష న్లు చేయబడవు. ఎలాంటి భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయబడవని, అనధికారికంగా లే అవుట్లు వేసి అమ్మకాలు చేస్తే స్థల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

-నరసింహారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌, బద్వేలు

Updated Date - Aug 23 , 2025 | 11:48 PM