Share News

వర్షం వస్తే ఆ రోడ్డు అంతే..?

ABN , Publish Date - Jul 27 , 2025 | 11:45 PM

ఓబుళాపురం-వరికుంట్ల రోడ్డు అస్తవ్యస్తం గా మారింది. కొద్దిపాటి వర్షం వచ్చినా రోడ్డుపై నీరు నిలిచి కుంటను తల పిస్తోంది.

వర్షం వస్తే ఆ రోడ్డు అంతే..?
నర్సాపురం- ఓబుళాపురం మధ్య నీరు నిలిచి కుంటను తలపిస్తున్న రోడ్డు

కాశినాయన జూలై27(ఆంధ్రజ్యోతి) ఓబుళాపురం-వరికుంట్ల రోడ్డు అస్తవ్యస్తం గా మారింది. కొద్దిపాటి వర్షం వచ్చినా రోడ్డుపై నీరు నిలిచి కుంటను తల పిస్తోంది. జ్యోతికి పోయే భక్తులు, 15 గ్రామాల ప్రజలు నిత్యం ఈరోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటారు. రోజూ వందల సంఖ్యలో బస్పులు, ఆటోలు, ద్విచక్రవాహనాలు ఈరోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటాయి. 3సంవత్సరాల క్రితం రూ.9 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో డబుల్‌ రోడ్డు మంజూరు కావ డంతో అందరూ ఈరోడ్డుకు మహర్ధశ పట్టిందనుకున్నారు. కానీ ప్రస్తుతం ఈరోడ్డు పరిస్థితి అనుకున్న దొక్కటి అయ్యింది ఇంకొక్కటి అన్నట్లుగా ఉంది. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్‌ సగంలోనే పనులు ఆపివేయడంతో రోడు ్డపరిస్థితి ఎటూమారని విధంగా తయారైంది. 12 కిలోమీటర్ల పొడవున్న ఈరోడ్డుపై దాదాపు 14 మలుపులు ఉన్నాయి. దాదాపు రెండు సంవత్సరాల క్రితం వరికుంట్ల నుంచి మిద్దెల ఎస్సీకాలనీ వరకు 8 కి.మీ మేర పనులు జరిగాయి. పనులు చేసినప్పటికీ ప్రస్తుతానికి ప్రతి మలుపువద్ద ఎదురుగా వచ్చే వాహనం కన్పించనంతగా ముళ్లకంప రోడ్డుపైకి చొచ్చుకొనివచ్చింది. మలుపులవద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవు. దీంతో మలుపుల వద్ద ఎదురెదురుగా వచ్చే వాహనాలు కన్పించక తరచూ ప్రమాదాలు జరుగుతు న్నాయి. మరోవైపు మండల కేంద్రమైన నర్సాపురం మీదుగా ఓబుళాపురం నుంచి మిద్దెల వరకు పనులు నిలిచి పోయిన 4 కి.మీ రోడుపై ఎక్కడ పడితే అక్కడ అడుగు నుంచి రెండు అడు గులమేర గుంతలు ఏర్పడి చిన్న పాటి వర్షం వచ్చి నా కుంటను తలపించేలా ఉండ డంతో ప్రయాణికులు ఇబ్బం దు లు పడుతున్నారు. ఎక్కడైనా ప్ర ధాన రోడ్లపై గుంతలు ఏర్పడితే సంబంధిత అధికారులు ముందు కొచ్చి కంకర పోసి ప్ర యాణికు లు అసౌకర్యానికి గురి కాకుండా చూసేవారు. ఎందుకో ఈ రోడ్డు గురించి పట్టిం చుకోక పోవడం శోచనీయం. ఇప్పటికైనా అధికారు లు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయిం చి మలుపుల వద్ద సూచిక బోర్డుల ఏర్పాటుతోపాటు కంప చెట్లను తొలగించాలని ప్రజ లు కోరుతున్నారు.

Updated Date - Jul 27 , 2025 | 11:45 PM