Share News

జగన్మాత నమోస్తుతే..!

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:54 PM

జగజ్జననీ.. జగన్మాత నమోస్తుతే..! అంటూదసరా ఉత్సవాల నిర్వహణలో రెండవ మైసూరుగా ప్రసిద్ధిచెందిన ప్రొద్దుటూరులో ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

జగన్మాత నమోస్తుతే..!
108 వెండికళశాలతో ఆర్యవైశ్య మహిళలు

ప్రొద్దుటూరు టౌన్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జగజ్జననీ.. జగన్మాత నమోస్తుతే..! అంటూదసరా ఉత్సవాల నిర్వహణలో రెండవ మైసూరుగా ప్రసిద్ధిచెందిన ప్రొద్దుటూరులో ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిశాల, రతనాల వేంకటేశ్వరస్వామి ఆలయం, శివాలయం, రాజరాజేశ్వరీదేవి ఆలయం, ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయాల్లో అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. చెన్నకేశవస్వామి ఆలయంలో ఆదిలక్ష్మిదేవిదేవి అలంకారంలో, గౌరమ్మ కట్టవీదిలో బాలా త్రిపురసుందరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. రతనాల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.

మైదుకూరు రూరల్‌లో: దసరా శరన్నవరాత్రి ఉత్స వాలు సోమవారం నుంచి అంగరంగ వైభ వంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే విద్యుత కాంతులతో ఆలయాలు వెలుగులు విరజిల్లుతు న్నాయి, మైదుకూరు పట్టణంలోని అమ్మవారిశా లలో దసరా ఉత్సవాలను ఆర్యవైశ్య సభ ఆధ్వ ర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు సోమవారం రాజరాజే శ్వరిదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శ నమిచ్చారు. అమ్మవారిని దర్శించుకొనేం దుకు భక్తులు భారీగా రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

బద్వేలుటౌనలో: పట్టణంలో శరన్నవరాత్ర ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. సోమవారం ప్రారంభమయ్యాయి. స్థానిక మహా లక్ష్మిదేవి ఆలయం నుంచి 108 వెండికళశాలతో ఆర్యవైశ్య మహిళలు మేళతాళాల మధ్య అం గరంగ వైభవంగా ఊరేగింపుగా అమ్మవారిశాల కు వచ్చి అమ్మవారిని అభిషేకించారు. అమ్మవా రిశాలలో అమ్మవారు విశ్వమాతాదేవి అలంకా రంలో దర్శనమివ్వగా, కోదండరామస్వామి ఆల యంలో మత్స్యావతారంలో, మహాలక్ష్మిదేవి ఆల యంలో ఆదిలక్ష్మిదేవిగా భద్రకాళీసమేత వీరభ ద్రస్వామి ఆలయంలో విష్ణుదుర్గాదేవిగా, కనక దుర్గాదేవి ఆలయంలో దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

Updated Date - Sep 22 , 2025 | 11:54 PM