వెల్లాల దేవస్థానానికి హుండీ ఆదాయం రూ.5.42 లక్షలు
ABN , Publish Date - May 17 , 2025 | 11:57 PM
వెల్లాల చెన్నకేశవ సంజీవరాయస్వామి బీమలింగేశ్వర స్వామి దేవస్థానానికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హుండీ ద్వారా పదిరోజులకు రూ.5,42,314 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహ ణాధికారి కేవీ రమణ తెలిపారు.
రాజుపాలెం, మే 17 (ఆంధ్రజ్యోతి): వెల్లాల చెన్నకేశవ సంజీవరాయస్వామి బీమలింగేశ్వర స్వామి దేవస్థానానికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హుండీ ద్వారా పదిరోజులకు రూ.5,42,314 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహ ణాధికారి కేవీ రమణ తెలిపారు. హుండీ పదిరోజుల తాత్కాలిక లెక్కింపును శనివారం సహాయ కమిషనరు మల్లిఖార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ ఛైర్మన నారాయణరెడ్డి, మాజీ ఛైర్మన రామసు బ్బారెడ్డి, టీడీపీ నాయకుడు సుబ్బిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.