Share News

విద్యుత వైర్లు ఇలా.. నాణ్యత ఎలా..?

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:15 AM

మండల పరిధిలోని కడప-కర్నూలు జాతీయ రహదారి సమీపంలో విద్యుత స్తంభానికి 11 కేవీ వైర్లు అతుకులతో వేలాడుతున్నాయి.

విద్యుత వైర్లు ఇలా.. నాణ్యత ఎలా..?
విద్యుత స్తంభానికి అతుకులతో ఉన్న 11 కేవీ వైర్లు

ఖాజీపేట, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కడప-కర్నూలు జాతీయ రహదారి సమీపంలో విద్యుత స్తంభానికి 11 కేవీ వైర్లు అతుకులతో వేలాడుతున్నాయి. దీంతో గాలీవాన వచ్చినప్పుడు విద్యుత వైర్లు ఒక దానికొకటి తగులుకుని సరఫరా బ్రేక్‌డౌనతో నిలిచి తద్వారా గ్రామా లు అంధకారంలో ఉండిపోవాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. నియోజకవర్గంలో ఎక్కడైనా విద్యుత్తు లైన్లు కిందకు వేలాడుతున్నా రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని మైదుకూరు శాసనసభ్యుడు పుట్టా సుధాకర్‌యాదవవ్‌ విద్యుత అధికారులకు సూచిస్తున్నా వారు పట్టించు కోవడంలేదేని ప్రజలు పేర్కొంటున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన గ్రామాల్లో ఇలాంటి సమస్యలు మరెన్నో ఉన్నాయి. ఇదిలా ఉండగా ప్రతి నెల రెండవ శనివారం విద్యుత తీగెల మరమ్మతులు చేస్తున్నామంటూ ఆ శాఖ అధికారులు కొన్ని గంటలపాటు విద్యుత సరఫరా నిలిపివేసి మరమ్మతు పనులు చేస్తున్నా ఇలాంటి 11 కేవీ వైర్లను ఎందుకు సరి చేయడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. విద్యుత అధికారుల నిర్లక్ష్యం వల్ల గాలీవానకు విద్యుత వైర్లుగాని, స్తంభాలు గాని కిందపడితే ప్రమాదాలు చోటు చేసుకోవడంతోపాటు గ్రామాల్లో అంధకారం ఏర్పడు తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్తు ఇవ్వకపోగా అతుకుల వైర్లతో ఉన్న కరెంటే సక్రమంగా ఇవ్వాలేని పరిస్థితులు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన ్నతాధికారులు స్పందించి ఇలా వేలాడుతున్న వైర్లను మరమ్మతులు చేసి రైతులకు నాణ్యమైన విద్యుత ఇవ్వాలని కోరుతున్నారు.

విద్యుత ఏఈ ఏమన్నారంటే: ఇలాంటి సమస్యలు తమ దృష్టికి రాలేదని విద్యుత శాఖ ఇనచార్జి ఏఈ నాగరాజు పేర్కొన్నారు. 11 కేవీ విద్యుత వైర్ల అతుకుల విషయమై ‘ఆంధజ్యోతి’ వివరణ కోరగా ఎక్కడైనా ఇలాంటి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తా మన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుతను అందించడమే విద్యుత శాఖ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

Updated Date - Jun 17 , 2025 | 12:15 AM