Share News

గృహాలు సరే.. రోడ్లు నిర్మించరా..?

ABN , Publish Date - Jun 19 , 2025 | 11:50 PM

ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికా రులు గృహ నిర్మాణాలు వేగవంతం చేస్తున్నా రోడ్డు మాత్రం నిర్మించక పోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గృహాలు సరే.. రోడ్లు నిర్మించరా..?
రహదారులు లేకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగిన దృశ్యం

పోరుమామిళ్ల, జూన 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికా రులు గృహ నిర్మాణాలు వేగవంతం చేస్తున్నా రోడ్డు మాత్రం నిర్మించక పోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వైసీపీ హ యాంలో మంజూరైన జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు నిధుల కొరత నత్తనడకన సాగిన విషయం విదితమే. దీంతో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఎన్టీఆర్‌ కాలనీ పేరుతో గృహ నిర్మాణాలను వేగవం తం చేయడంతో మంజూరైన గృహాలు దాదాపు 90 శాతం పూర్తి చేసుకునే స్థాయికివచ్చాయి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు రూ.50వేలు అదనంగా కేటాయించడంతో లబ్ధిదారులు నిర్మాణాలకు ఆసక్తి చూపుతున్నారు. పోరు మామిళ్ల, రంగసముద్రం మినహా మిగిలిన పంచాయతీల్లో దాదాపు 90 శాతం గృహాలు పూర్తయ్యాయి. కాకపోతే రహదారుల నిర్మాణం చేపడితే తమకు పూర్తిస్థాయిలో సౌకర్యం కలుగుతుందని లబ్ధిదారులు చెబుతు న్నారు పోరుమామిళ్ల మండలంలో 1339 పక్కాగృహాలు మంజూరు కాగా రెండు ఎనఎస్‌లో ఉండగా మరో 115 బీబీఎల్‌ దశలో ఉండిపోయాయి. 24 లెంటల్‌ లెవల్‌లో, 160 రూఫ్‌లెవల్‌లో, 20 శ్లాబు లెవెల్‌లో ఉన్నాయి. 907 గృహాలు పూర్తయ్యాయి. లబ్ధిదారులు. పోరుమామిళ్ల, రంగసముద్రం పం చాయతీలకు సంబంధించి ఎక్కవ గృహాలు మంజూరయ్యాయి. కాలనీల్లో రోడ్లు, వీధిలైట్లు తదితర మౌలిక సదుపాయలు లేక చీకట్లోనే జీవనం సాగిస్తున్నామని వాపోతున్నారు. కాలనీలకు ఏర్పాటు చేసిన పైపులైనును ఇతరులు కూడా దిగువన ఉన్న వారు పైపులైను తీసుకోడం వల్ల ఇబ్బంది ఉందని చెబుతున్నారు.

హౌసింగ్‌ ఏఈ ఏమన్నారంటే:ఈ విషయమై హౌసింగ్‌ ఏఈ నాగజ్యోతి ని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగ, ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనంగా రూ.50వేలు కేటాయించిన తరువాత గృహనిర్మాణాలు వేగవంతమయ్యా యన్నారు. దాదాపు 90శాతం నిర్మాణాలు పూర్తయ్యాయని రంగసముద్రం, పోరుమామిళ్లలో నిర్మాణాలు జరగాల్సి ఉందన్నారు. అనుకున్నలక్ష్యాలను త్వరగా సపూర్తి చేస్తామన్నారు. గృహాల వరకు మాత్రమే తమకు ఆదేశా లున్నాయని రహదారులు సంబంధిత శాఖ వారు చేపట్టాల్సి ఉందన్నారు.

గాలీవాన వస్తే రెండు రోజులు ఇబ్బందిగా ఉంటుంది

గాలీవాన వస్తే కరెంటు కాలనీలో రెండు రోజులు కరెంట్‌లేక తీవ్ర వీధిలైట్లు కొన్ని చోట్ల వెలుగుతుండగా మరికొన్ని చోట్ల వెలగడంలేదు. అక్కడక్కడా పైపులైన్లు కూడా లీకవుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలి.

- తిరుమలయ్య, రంగసముద్రం

Updated Date - Jun 19 , 2025 | 11:50 PM