Share News

హైస్కూల్‌ను పునరుద్ధరించాలి

ABN , Publish Date - May 10 , 2025 | 11:18 PM

మండలంలోని క్రిష్ణంపల్లె హైస్కూల్‌ను వెంటనే మంజూరు చేయాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

హైస్కూల్‌ను పునరుద్ధరించాలి
హైస్కూలు కావాలంటూ నిరసన తెలుపుతున్న క్రిష్ణంపల్లె గ్రామస్థులు

రద్దయిన పాఠశాలను తిరిగి మంజూరు చేయాలంటున్న క్రిష్ణంపల్లె వాసులు వసతుల్లేక అనుమతులివ్వలేదంటున్న అధికారులు

పోరుమామిళ్ల, మే 10 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని క్రిష్ణంపల్లె హైస్కూల్‌ను వెంటనే మంజూరు చేయాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 7వతరగతి వరకు ఉన్న స్కూలు కు మోడల్‌ స్కూలు, హైస్కూలు మంజూరు అ యితే తగిన వసతులు లేవన్న కారణంగా ప్రభు త్వం వాటిని రద్దు చేయడంతో ఆ గ్రామస్థులు తిరిగి తమ ప్రాంతంలోని విద్యార్థులకు పదో తరగతి వరకు తమ గ్రామంలోనే చదువుకునేం దుకు అవకాశం కల్పించి హైస్కూలును మంజూరు చేయాలని కోరుతున్నా రు. గతంలో క్రిష్ణంపల్లె, పుల్లీడు, ఎస్‌.వెంకటరామాపురం ప్రాంతాల్లో మోడల్‌ స్కూలు, హైస్కూలు మంజూరయ్యా యి. కానీ ఇక్కడ ఉన్న తరగతి గదులకు వస తులు లేవనే సాకుతో ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. దీంతో క్రిష్ణంపల్లె గ్రామస్థులు గ్రీవెన్సలో కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రస్తుతం అప్పర్‌ ప్రైమరీ స్కూలుకు ఉన్న తమ పాఠశాలను హైస్కూలుగా మారి స్తే గ్రామీణ పాంతంలోని పేద విద్యార్థులకు విద్యావకా శాలు కల్పించినట్లవుతుందని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం తమ గ్రామంలో ఉన్న పాఠశాలలో పదో తర గతికి సరిపడా రూములు ఉన్నాయని, పాఠశాల ఆవరణ లో 90 సెంట్ల స్థలం ఉందని ఈ సందర్భంగా గ్రామస్థు లు కోరుతున్నారు.

అధికారుల తప్పుడు రిపోర్టు వల్లే సమస్య

విద్యాశాఖాధికారులు ఇచ్చిన తప్పుడు నివేదిక వల్లనే తమకు పదో తరగతి పాఠశాలకు అనుమతి లేకుండా పోయేందుకు కారణమైంది. క్రిష్ణంపల్లెలో 6, 7, 8 తరగతుల్లో 62 మంది, మొత్తం విద్యార్థులు 116 మంది మౌలిక సదుపా యాలు అన్నితరగతులు 96 సెంట్ల స్థలం ఉన్నప్పటికీ ఉన్నతాధికారులకు విద్యాశాఖాధికా రులు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల పదోతరగతి అవకాశం లేకుండా పోయింది. క్రిష్ణంపల్లె పాఠశాల విషయంలో విద్యాశాఖాధి కారులు ఎందుకు వివక్ష చూపుతున్నారో అర్ధం కావడంలేదు. పోరుమామిళ్ల మండలంలో వెంక టాపురం, ఈదుళ్లపల్లె పాఠశాలల్లో తగినన్ని తర గతి గదులు లేకపోయినా వాటిని మాత్రం మోడల్‌, ప్రైమరీ స్కూలుగా మార్చారు. క్రిష్ణంప ల్లెకు పదోతరగతి పాఠశాల అనుమతి తెచ్చేంత వరకు పోరాటం చేస్తాం. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లడానికి కూడా వెనుకాడం.

-రామచంద్రారెడ్డి, విద్యాకమిటీ చైర్మన

మా చేతుల్లో ఏమిలేదు..

క్రిష్ణంపల్లె పదోతరగతి పాఠశాలకు సంబంధించి అనుమతికి డీఈవో కార్యాలయం నుంచి తమకు వచ్చిన ఆదేశాల మేరకు నామ్స్‌ పరిశీలించాం. క్రిష్ణంపల్లెలో పదో తరగతి పాఠశాలకు సంబం ధించి ప్రపోజల్స్‌ రావడంతో డీఈఓ కార్యాలయం నుంచి సీజబులిటీ ఉందా? లేదా? అని అడగడం తో ఆ పాఠశాలను పరిశీలాంచాం, ఆ పాఠశాల లో మూడు చిన్న గదులు, మూడు పెద్దగదులు మాత్రమే ఉన్నాయి. పదో తరగతికి 8 తరగతి గదులు అవసరం అవుతాయి. ఈ నివేదికనే డీఈవో కార్యాలయానికి తెలియజేశాం. ప్రస్తుతం ఈ విషయం లాగిన అయింది. డీఈవో కార్యా లయం పరిధిలో కూడా లేదు. ఇప్పుడు అనుమ తులు రావాలంటే స్టేట్‌ పరిధిలో ఉంటుంది. ప్రస్తుతం ట్రాన్సఫర్స్‌ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి.

-కాశయ్య, ఎంఈవో, పోరుమామిళ్ల

Updated Date - May 10 , 2025 | 11:18 PM