యోగాతో ఆరోగ్యం.. ఆనందం
ABN , Publish Date - Jun 22 , 2025 | 12:02 AM
యో గాతో మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరో గ్యం పదిలంగా ఉంటుందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తెలిపారు.
ప్రొద్దుటూరు , జూన 21 (ఆంధ్ర జ్యోతి) : యో గాతో మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరో గ్యం పదిలంగా ఉంటుందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తెలిపారు. శనివారం అంత ర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు యోగాంధ్ర కార్యక్రమంను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేప ట్టారు. అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూలు, టీటీడీ కళ్యాణ మండపంలో యో గాంధ్ర కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్తమాన కంప్యూటర్ సమాజంలో మనిషి జీవి తం ఎంతో బిజీ గా మారిందని అందువల్ల వ్యా యామానికి తగిన సమయం కేటాయించక పోవడంతో అనేక మానసిక శారీరక రుగ్మతలకు గురవుతున్నాడన్నారు. ఆర్డీవో సాయిశ్రీ, మున్సిప ల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్య దర్శి నంద్యాల కొండారెడ్డి, టీడీపీ పట్టణ అధ్య క్షుడు ఈవీ సుధాకర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఘంటశాల వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిల్లర్లు వద్దిబాలుడు, రామాంజనే యులు సుబ్బారావు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. గీతాశ్రమంలో జరిగిన యోగా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి పాల్గొన్నారు.
ప్రొద్దుటూరులో యోగా దినోత్సవం
ప్రొద్దుటూరు టౌన్/రూరల్ జూన్ 21 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని స్థానిక ఐఎంఏ హాలులో వైద్యులు యోగాసనాలు వేశారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ త్యాగరాజారెడ్డి, డాక్టర్ వరుణ్‌కుమార్‌రెడ్డి, ఇతర వైద్యులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాలలో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మే 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజులపాటు యోగా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసప్రసాద్, పశువైద్యులు రాజాకిశోర్, జీవన, తదితరులు పాల్గొన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరు మండలంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, టీడీపీ నాయకులు, ప్రజలు విద్యార్థులు భారీగా పాల్గొని యోగాసనాలు చేశారు. గోపవరం పంచాయతీ పరిధిలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బచ్చల పుల్లయ్య, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, స్థానిక నాయకులు పట్నం లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని ఖాదర్‌బాద్ పంచాయతీ కార్యాలయ ఆవరణలో కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆద్వర్యంలో యోగా కార్యక్రమాన్ని చేపట్టారు.
స్థానిక ఎస్‌ఆర్‌ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పాం డురంగన్‌రవి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషితో ఐక్యరాజ్య సమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందన్నారు. ప్రజలు ఆరోగ్యం కోసం ప్రతి రోజు యోగా సాధన చేయాలని సూచించారు. అనంతరం ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రాం ఆఫీసర్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్ బసిరెడ్డి రాజేశ్వరరెడ్డి, వైస్‌ప్రెసిడెంట్ వీరకుమార్‌రెడ్డి, కరస్పాండెంట్ వీరకల్యాణ్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
యోగాను దినచర్యగా మార్చుకోవాలి
బద్వేలు/టౌన, జూన 21 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యగా మార్చుకొని మా నసిక, శారీరక ఒత్తిళ్లను దూరం చేసుకోవాలని బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన పేర్కొన్నారు. శనివారం 11వ అంతర్జాతీయ యోగాదినోత్స వంలో భాగంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపుమేరకు బద్వేలు పట్టణంలోని ఎస్‌బీవీ ఆర్ డిగ్రీకళాశాల మైదానంలో కనీవిని ఎరుగని రీతిలో సుమారు 5వేల మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆర్డీవో చంద్రమోహనరెడ్డి, డీఎస్పీ రాజేం ద్రప్రసాద్, నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి రితేష్ కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరసింహా రెడ్డి, తహసీల్దార్‌లు ఉదయభాస్కరరాజు, త్రిభు వనరెడ్డిలు పాల్గొని యోగాసనాలను చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన సూర్యనారాయణ రెడ్డి, కూటమి నాయకుడు బొజ్జా రోశన్న, ఆర్యవైశ్య కార్పొరేషన చైర్మన వెంకటసుబ్బయ్య, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్‌లు, హెడ్మాస్టర్లు, విద్యార్తిని, విద్యార్థులు పాల్గొన్నారు.
జమ్మలమడుగులో: మన జీవన విధానంలో యోగా ఒక భాగం కావాలని దాంతో ఎన్నో లాభాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్సీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవగుడి నారాయణరెడ్డి సూచించారు. శనివారం జమ్మలమడుగులోని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలలో, ఆలయాలు తదితర ప్రాంతాల్లో అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవంలో భాగంగా యోగాసనాలు చేశారు. జమ్మలమడుగు జూనియర్ సివిల్‌జడి ్జ కోర్టు ఆవరణలో జడ్జి భార్గవి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. జమ్మలమడుగు పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, వారి సిబ్బంది స్థానిక సెయింట్‌మేరీ హైస్కూలు మైదానంలో యోగాసనాలు చేశారు. ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో బీజేపీ మహిళా మో ర్చా నాయకురాలు మెరుగు అరుణకుమారి, మేకల ఆంజనేయులు, హెడ్మాస్టర్ జయలక్ష్మి, మోహన్, లక్ష్మిదేవి యోగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకున్నారు. దేవగుడిలో కూటమి నాయకులు చదిపిరాళ్ల శివనారాయణరెడ్డి, డ్రిల్ మాస్టర్లు, మార్కెట్‌యార్డు ఛైర్మన్ సింగంరెడ్డి నాగేశ్వరరెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు యోగా చేశారు.
మైదుకూరు రూరల్‌లో: ప్రతి ఒక్కరూ యో గా చేయడం వలన ఆరోగ్యంతో పాటు ఆనం దంగా ఉంటుందని యోగా గురువు డాక్టర్ కృష్ణారెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంద్ర- 2025 కార్యక్రమాన్ని అధికారులు, ప్రజలు ఘ నంగా నిర్వహించారు. కార్యక్రమంలో తహశీల్థా ర్ రాజసింహ్మనరేంద్ర. మున్సిపల్, చైర్మన్ మాచనూరు చంద్ర, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా యోగా దినోత్సవం
ఎర్రగుంట్ల/మైలవరం/ముద్దనూరు/దువ్వూరు
చాపాడు//కొండాపురం/బి.మఽఠం/బి.కోడూరు/
కాశినాయన/కలసపాడు/ఖాజీపేట/పోరుమా
మిళ్ల/రాజుపాళెం, జూన 21(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా డే విజయవంతంగా జరి గింది. ఉదయం 7గంటల నుంచే వేలాదిగా విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశా లలు, ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజిలకు చెంది న విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, అధికారులు ప్రజలు పాల్గొని యోగా చేశారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహఖ కార్యదర్శి సీఎం. సురేష్‌నాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని పోట్లదుర్తి లోని జడ్పీ హైస్కూల్‌లో యోగా దినోత్సవంలో ఆయన పాల్గొని యోగా సాధనంచేశారు.