Share News

తల్లికి వందనంతో ప్రతి గడపలో ఆనందం

ABN , Publish Date - Jun 17 , 2025 | 11:48 PM

కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్‌ సిక్స్‌ పథకాల్లో ఒకటైన తల్లికి వంద నం పథకాన్ని అమలు చేయడంతో ప్రతి గడపలో ఆనందం వెల్లివిరు స్తోందని బద్వేలు టీడీపీ నియోజక వర్గ ఇనచార్జి రితేష్‌కుమార్‌రెడ్డి పేర్కొ న్నారు.

తల్లికి వందనంతో ప్రతి గడపలో ఆనందం
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి రితేష్‌కుమార్‌రెడ్డి

వైసీపీ వి దిగజారుడు వ్యాఖ్యలు టీడీపీ నేత రితేష్‌కుమార్‌రెడ్డి ధ్వజం

బద్వేలుటౌన, జూన 17 (ఆంధ్రజ్యో తి) : కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్‌ సిక్స్‌ పథకాల్లో ఒకటైన తల్లికి వంద నం పథకాన్ని అమలు చేయడంతో ప్రతి గడపలో ఆనందం వెల్లివిరు స్తోందని బద్వేలు టీడీపీ నియోజక వర్గ ఇనచార్జి రితేష్‌కుమార్‌రెడ్డి పేర్కొ న్నారు. మంగళవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావే శంలో ఆయన మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ పథకాల అమలు, వేగంగా రాష్ర్టాభివృద్ధి జరగడంచూసి ఓర్వలేని వైసీపీ నాయకులు తల్లికి వందనం పథకంపై విషం చిమ్ము తూ దిగజారుడు వాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. వైసీపీ నేతలు దిగజారుడు ఆరో పణలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వం పారదర్శకంగా పథకాలను అమలు చేస్తుండటంతో రాష్ట్ర ప్రజల్లో ఆనందం వెల్లి విరుస్తోందన్నారు. అలాగే డొక్కా సీతమ్మ పథకం ద్వారా సన్న బియ్యంతో విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంగల్‌ రెడ్డి, రాగిమాను ప్రతాప్‌కుమార్‌, మస్తానబాబు, రామానాయుడు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 11:48 PM