భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
ABN , Publish Date - Jul 10 , 2025 | 11:40 PM
గురుపౌర్ణమిని పురష్కరించుకొని బద్వేలు నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం వైభవోపేతంగా భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహిం చారు.
బద్వేలుటౌన, జులై 10 (ఆంధ్రజ్యోతి) : గురుపౌర్ణమిని పురష్కరించుకొని బద్వేలు నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం వైభవోపేతంగా భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహిం చారు. తెలుగుగంగ కాలనీ సాయినగర్‌లో వెలసిన దత్తసాయిబాబా ఆలయంలో వేకువ జాము నుంచే సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగడ హారతి, పంచా మృతాభిషేకం నిర్వహించారు. గురుపౌర్ణమి సందర్భంగా సమీప గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు సుమారు 20వేల మంది తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. మధ్యాహ్నం సుమారు 20వేల మందికిపైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి దత్తసాయిబాబా ఆలయంలో మేళతాళాలతో, ప్రత్యేక పుష్పాంకరణతో సాయిబాబా పల్లకి సేవలు, సాయిభజనలు నిర్వహించారు. అనంతరం రాత్రి తేజ్‌హారతి నిర్వహించారు.
ప్రొద్దుటూరు టౌన్‌లో: గురుపౌర్ణమి సందర్భంగా పట్టణంలోని వివిధ ఆలయాల్లో వేడుకలను వైభవంగా నిర్వహించారు. దొరసానిపల్లె షిరిడీసాయిబాబా ఆలయంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. స్వామివారికి పంచామృతాభిషేకం, గోక్షీరాభిషేకం చేసి ప్రత్యేకంగా అలంకరించారు. వసంతపేటలోని సాయిబాబా ఆలయం, వైఎంఆర్ కాలనీలోని సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్తపీఠంలో దత్తాత్రేయ లోకకల్యాణార్థం గణపతి, నవగ్రహ, దత్తాత్రేయ హోమాలు నిర్వహించారు. వివిధ ఆలయాల్లో మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వినియోగం చేశారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆలయాల్లో దుమి చుట్టూ ప్రదక్షణలు చేశారు.