జీఎస్టీ తగ్గింపు.. పేదలకు సూపర్ గిఫ్ట్
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:53 PM
జీఎస్టీ తగ్గింపుతో పేద, మధ్యతరగతి వర్గాలకు ఎన్డీయే ప్రభుత్వం సూపర్‌గిఫ్ట్ ఇచ్చిందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.
జమ్మలమడుగు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ తగ్గింపుతో పేద, మధ్యతరగతి వర్గాలకు ఎన్డీయే ప్రభుత్వం సూపర్‌గిఫ్ట్ ఇచ్చిందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని కూరగాయల మార్కెట్‌వీధి, పెద్దమ్మ గుడి బంగారు దుకాణాల వద్ద, మెయిన్‌బజార్‌లోని మందుల షాపులు, బియ్యం దుకాణాలను సందర్శించి వస్తువుల ధరలు అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సెప్టెంబరు 22వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబల్ డమాకా జరగాలని సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రతి దుకాణాదారుడు నోటీసు బోర్డు ఏర్పాటు చేసి గతంలో ధరల పట్టిక, ప్రస్తుతం తగ్గిన ధరలకు సంబందించి ప్రదర్శనగా ఉంచాలని అప్పుడే ప్రజల్లో అవగాహన వస్తుందన్నారు. టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుపై ప్రజలను చైతన్యపరిచేందుకు అక్టోబరు 16వ తేదీన కర్నూలుజిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారని ఈ సభలో ప్రతి ఒక్కరు పాల్గొని చైతన్యం కావాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు శివనారాయణరెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ సింగంరెడ్డి నాగేశ్వరరెడ్డి, కౌన్సిలరు పోలీసు చంద్ర, కమిషనర్ వెంకటరామిరెడ్డి, సర్పంచులు రామాంజనేయరెడ్డి, గురుశేఖ ర్‌రెడ్డి, కొండయ్య, టీడీపీ నాయకులు కర్ణాటి రామాంజనేయరెడ్డి, లక్ష్మణనాయుడు, నాగేంద్రయాదవ్, తదితరులు పాల్గొన్నారు.